నిఖిల్ దూకుడు మామూలుగా లేదే

Update: 2021-11-19 06:34 GMT
యంగ్ హీరో నిఖిల్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కెంటెంట్ బేస్డ్ చిత్రాల్ని ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని మార్కెట్ లో దూసుకుపోతున్నాడు. మీడియం రేంజ్ హీరోల్లో నిఖిల్ ఎంపిక చేసుకుంటోన్న స్క్రిప్ట్ ల‌కి మంచి బ‌జ్ ఉంటుంది.

కంటెంట్ నే త‌న బ్రాండ్ గా మార్చుకుని ప్రీ ప్లాన్డ్ గా ముందుకెళుతున్నాడు. ప్ర‌స్తుతం నిఖిల్ వ‌రుస‌గా రెండు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఒక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ `కార్తికేయ` సీక్వెల్ `కార్తికేయ‌-2` కాగా..మ‌రొక‌టి `18 పేజీస్` లో న‌టిస్తున్నాడు. ఇవి రెండూ వేటిక‌వే స్పెష‌ల్.

అలాగే చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `కార్తికేయ‌-2`పై ప్ర‌త్యేక క్యూరియాసిటీ నెల‌కొంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన మొద‌టి భాగం పెద్ద విజం సాధించ‌డంతో సీక్వెల్ పై రెట్టింపు అంచనాలున్నాయి. యంగ్ మేక‌ర్ చందు మొండేటికి కూడా సక్సెస్ కీల‌క‌మైన స‌మ‌యం కావ‌డంతో ప్ర‌తిదీ ప‌క్కా ప్లాన్డ్ గానే ముందుకెళ్తున్నాడు.

ఇక `18 పేజీస్ `చిత్రాన్ని శివ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న రెండు ప్రాజెక్ట్ ల్లో ఒకే హీరోయిన్ న‌టించ‌డం విశేషం. `18 పేజీస్`..`కార్తికేయ‌-2` లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్ న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాలు దాదాపు షూటింగ్ క్లైమాక్స్ కి వ‌చ్చింది.

నెల రోజు గ్యాప్ లోనే ఇవి రెండూ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. `కార్తికేయ‌-2` రిలీజ్ తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇవిగాక నిఖిల్ చేతిలో మ‌రో రెండు చిత్రాలు ఉన్నాయి. ఆన్ సెట్స్ ఉన్న చిత్రాలు రిలీజ్ అయిన త‌ర్వాత ఈ రెండిటిని కూడా ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లే అవ‌కావం ఉంది.

మ‌రి ఈ చిత్రాలకు ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు? నిర్మాత‌లు ఎవ‌రు? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది. గ‌త లాక్ డౌన్ లో పెళ్లి త‌ర్వాత నిఖిల్ లో జోష పెరిగింది. కెరీర్ పై పూర్తిగా ఫోక‌స్ చేసిన‌ట్టే క‌నిపిస్తోంది.
Tags:    

Similar News