24కేజీల బరువు తగ్గిన యంగ్‌ హీరో

Update: 2022-10-21 10:30 GMT
యంగ్‌ హీరో సందీప్‌ కిషన్ సక్సెస్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తన సొంత బ్యానర్‌ లో కూడా అప్పుడప్పుడు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకునే ప్రయత్నం చేయడంతో పాటు విభిన్న సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం మైఖేల్‌ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో సందీప్‌ కిషన్‌ ఉన్నాడు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా టీజర్ విడుదల చేసిన ఈ సినిమా పై జనాల్లో మంచి అంచనాలు నమోదు అయ్యాయి.

తెలుగు తో పాటు అన్ని భాషల్లో కూడా సినిమా టీజర్ ను విడుదల చేయడం జరిగింది. తమిళనాట టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఇతర భాషల్లో కూడా టీజర్ పై జనాలు ఆసక్తి చూపించారు. ఇక టీజర్ విడుదల సమయంలో హీరో సందీప్‌ కిషన్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సందీప్‌ మాట్లాడుతూ... మూడు సంవత్సరాలుగా మైఖేల్‌ కోసం కష్టపడుతున్నాం. దర్శకుడు నాకు ఒక గిఫ్ట్‌. సినిమా కోసం ప్రతి రోజు కష్టపడ్డాం. నేను ఏకంగా 24 కేజీల బరువు తగ్గాను. ప్రతి సన్నివేశం కూడా ఎంతో ఇష్టపడి చేశాం. ఇక విజయ్ సేతుపతి తో కలిసి నటించిన ఆ రోజులను ఎప్పటికి మర్చిపోలేం.

ఎప్పుడు చూసినా కూడా అలసి పోకుండా ఉత్సాహంగా కనిపించిన ఆయన్ను చూసి చాలా నేర్చుకున్నాను. చాలా విభిన్నమైన ప్రయత్నం ను చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం మాకు ఉందని ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ అన్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News