అదేంటో మరి.. కామెడీ అనుకుంటున్నారో ఏంటో తెలియదు కాని... చాలామంది హీరోలు వేరే హీరోల ఆడియో ఫంక్షన్లలో మరొక హీరోను బీభత్సంగా ఆడేసుకుంటూ ఉంటారు. కాని అలా చేయడం వలన అవతల వారిని కించపరచడమే అనేది గ్రహించరు.
అప్పుడెప్పుడో స్వామి రారా సినిమా ఆడియో ఫంక్షన్ లో అల్లరి నరేష్ అండ్ మంచు మనోజ్ లు కలసి.. హీరో నిఖిల్ పై నానా కామెడీలే చేశారు. ఇక నిన్న ఈడోరకం ఆడోరకం ఆడియో ఫంక్షన్ లు విష్ణు అండ్ రాజ్ తరుణ్ లు కూడా అలాంటిదే ప్రయత్నించారు. కాకపోతే చివర్లో నిఖిల్ కు చిర్రెత్తుకొచ్చింది. రాజ్ తరుణ్ కాస్త ఓవర్ అయిపోయి.. విష్ణు మొదలెట్టిన 'గే' కామెడీని వేరే లెవెల్ కు తీసుకెళదాం అని ప్రయత్నించడంతో.. ''ప్లీజ్ రాజు.. నాకు కూడా బ్రెయిన్ లో అంతకంటే క్రేజీ ఐడియాలే వస్తుంటాయి. నువ్వు ఇంక ఆపేయ్'' అంటూ కొంచెం కోపంగానే నిఖిల్ చెప్పాడు.
ఇదొక ఎత్తయితే.. రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఇద్దరు హీరోయిన్లున్న సినిమాలో హెబా పటేల్ బాగా చేసిందంటూ ఆమెపై పూలు జల్లే ప్రయత్నం చేశాడు. అలాగే స్టేజీ మీద ఒక్కసారి కూడా తిన్నంగా నుంచోడే. ఈ విషయాన్ని అందరూ గమనించినా.. రియాక్ట్ అయ్యింది మోహన్ బాబు ఒక్కరే. ''ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు ఒకరినే పొగడటం అనేది తప్పు. అలా చేయొద్దు రాజ్ తరుణ్. ఇక తిన్నగా నుంచోవు నాకు తెలుసు'' అంటూ తిక్కను సరి చేసుకోమని సెలవిచ్చారు. అలాగే హీరో సుశాంత్ కూడా మంచు విష్ణు ఒక్కడినే పొగడటం.. మోహన్ బాబుకు నచ్చలేదు. మరో హీరో రాజ్ తరుణ్ గురించి కూడా చెప్పాలని.. అలాంటి స్నేహభావం పెంపొందించుకోవాలని చెప్పుకొచ్చారు.
ఇదంతా చూస్తున్న సినీ ప్రేక్షకులు ఏమంటున్నారంటే.. నిజంగానే కొంతమంది హీరోలు ఇలా ఆడియో ఫంక్షన్లలో దూల వేషాలు తగ్గించుకుంటే బెటర్ అనే అంటున్నారు. ఎందుకంటే అన్ని ఫంక్షన్లలో మోహన్ బాబు ఉండరు కదా వీరిని మందలించడానికి.