కాస్టింగ్ కౌచ్ పై నోరువిప్పిన యంగ్ హీరోయిన్!

Update: 2021-04-20 11:30 GMT
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం ఇంకా రగులుతూనే ఉంది. ఒక్కొక్కరుగా హీరోయిన్స్ గతంలో వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ప్రాచీ దేశాయ్ తన కెరీర్లో ఎదురైన కాస్టింగ్ కౌచ్ విషయాన్నీ బయటపెట్టింది. "కెరీర్ ప్రారంభంలో ఓ పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. కానీ ఆ దర్శకుడు నన్ను కంప్రమైస్ కావాలని అడిగాడు. అందుకు నేను నిరాకరించి ఆ సినిమా వదిలేసాను. కానీ ఆ దర్శకుడు మాత్రం నన్ను వదలలేదు. ఆ తర్వాత కూడా నన్ను తన సినిమాలోకి అడుగుతూనే ఉన్నాడని" చెప్పింది. ప్రాచీ 2006లో 'కసం సే' అనే పాపులర్ షో ద్వారా రంగప్రవేశం చేసింది. అనంతరం 2008లో 'రాక్ ఆన్' సినిమాతో అమ్మడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

అప్పటినుండి ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, బోల్ బచ్చన్, అజార్ లాంటి సినిమాలలో నటించింది. కానీ కొంతకాలంగా ప్రాచీ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆ విషయం పై మాట్లాడుతూ.. పెద్ద పెద్ద సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ వాటి వలన నాకు ఉపయోగం లేదని చేయలేదు. అందుకే ఈ గ్యాప్ వచ్చింది. మంచి పాత్ర నా కెరీర్ కు ఉపయోగపడేది వస్తే చేస్తానని చెబుతోంది. ప్రాచీ చివరిగా సైలెన్స్ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో కనిపించింది. మనోజ్ బాజపేయ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ను అభాన్ బరుచా డియోహాన్స్ రూపొందించాడు. ఈ థ్రిల్లర్ గతనెలలోనే జీ5 లో ప్రసారం అయింది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో చర్చలు జరుపుతుందట. మళ్లీ త్వరలోనే వరుసగా సినిమాలతో బిజీ అవుతానంటుంది. చూడాలి మరి ఈ సుందరి కూడా కాస్టింగ్ కౌచ్ పై స్పందించి మంచి పని చేసిందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News