నాని క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టకుమార్ హీరో నానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి మిశ్రమస్పందన ఎదురవుతోంది. నాని మాటల్లో నిజముందని `బాహుబలి` నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా తన మద్దతుని తెలిపి ఇండస్ట్రీ వర్గాలకు షాకిచ్చారు. తాజాగా నానికి అండగా మరో యంగ్ నిర్మాత స్పందించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వివరాల్లోకి వెళితే... సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హీరో నాని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయా నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం వుందన్నారు. ఈ మేరకు గురువారం `శ్యామ్ సింగ రాయ్` రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో నాని `ఏపీ ప్రభుత్వం టకెట్ ధరల్ని తగ్గించిందని, ఏది ఏమైనా ఇది సరైన నిర్ణయం కాదన్నారు. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులని అవమానించారన్నారు.
అంతే కాకుండా థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణ షాపుల కలెక్షన్ ఎక్కువగా వుందని, టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకుకు ఉందని కౌంటర్ ఇచ్చారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న నిర్మాత నట్టకుమార్ టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతున్న వేళ నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, తను ఏపీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.
అయితే నాని కి అండగా `బాహుబలి` నిర్మాత శోభు యార్లగడ్డ నిలిచారు. నాని మాట్లాడిన మాటల్లో నిజముందని, తాను ఆ మాటలతో ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. తాజాగా నట్టి కుమార్ కు కౌంటర్ ఇస్తూ నానికి అండగా నిలిచారో యంగ్ నిర్మాత ఎస్ కె ఎన్. గత పదేళ్లుగా మీరు ఎలాంటి సినిమాల్ని నిర్మించారు డియర్ నట్టి కుమార్. మీరు నిర్మించిన చిత్రాలు థియేటర్లలో కనీసం కోటి షేర్ ని అయినా రాబట్టగలిగాయా? ..
అలాంటి మీరు కలెక్షన్ ల గురించి మాట్లాడటం.. నాని గారి లాంటి హీరోకు కౌంటర్ లు ఇవ్వడం.. ఖర్మ కాకపోతే ఏంటి ఇది? .. అన్ని ఏరియాల్లో లాభాల్ని తెచ్చిపెడుతున్న సినిమాలు ఒక్క ఏపీలో మాత్రం టకెట్ రేట్ ల కారణంగా నష్టాలని చూస్తున్నాయి` అంటూ నానిని టార్గెట్ చేసిన నట్టి కుమార్కు నిర్మాత ఎస్ కె ఎన్ గట్టి కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.