తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ డంను దక్కించుకున్న హీరో సూర్య. ఈయన నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘ఎన్ జీకే’ చిత్రం కోసం తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు సెల్వ రాఘవన్ తెలుగు ప్రేక్షకులకు ‘7/జి బృందావ కాలనీ’ మరియు ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ చిత్రాలతో సుపరిచితుడు. అందుకే ‘ఎన్ జీకే’ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని దక్కించుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఇక ఈ చిత్రం ఆడియో గురించిన ఒక వార్త ప్రస్తుతం తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలకు కూడా సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా వర్క్ చేసిన విషయం తెల్సిందే. తాజాగా ఈ చిత్రంకు కూడా యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడు. సెల్వ రాఘవన్ టేస్ట్ కు తగ్గట్లుగా యువన్ శంకర్ రాజా పాటలను ట్యూన్ చేశాడు. ఇటీవలే ఆ పాటలను విన్న దర్శకుడు సెల్వ ఒక్క పాట కూడా నచ్చలేదు అంటూ అన్ని ట్యూన్స్ ను తిరష్కరించినట్లుగా తెలుస్తోంది. దాంతో యువన్ శంకర్ మళ్లీ కొత్తగా ట్యూన్స్ చేసేందుకు సిద్దం అయ్యాడు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను మొదట దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. అయితే షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు - ట్యూన్స్ సిద్దం కాని కారణంగా డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. సెల్వ రాఘవన్ తాను అనుకున్నట్లుగా ఔట్ పుట్ వచ్చే వరకు వదిలి పెట్టడని - తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు అంటూ తమిళ ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే ఆయన సినిమాలు ఆలస్యం అవ్వడం జరుగుతుందని - అప్పుడప్పుడు వచ్చినా కూడా ఆయన మంచి సినిమాలతో ఆకట్టుకుంటాడు అంటూ తమిళ సినీ విశ్లేషకులు అంటూ ఉంటారు.