సుశాంత్ కేసు : 'అతన్ని పట్టుకొని నార్కో టెస్ట్ చేస్తే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది'

Update: 2020-09-29 04:00 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ సూసైడ్ కేసు మిస్ట‌రీ థ్రిల్లర్ ని తలపిస్తూ చివరకు డ్రగ్ రాకెట్ దగ్గర ఆగింది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసుని డీల్ చేస్తున్న సీబీఐ - ఈడీలకు తోడుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ చేయడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సుశాంత్ డెత్ మిస్టరీ కేసు కాస్తా బాలీవుడ్ డ్రగ్ కేసుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ బాయ్ ఫ్రెండ్ ని విచారిస్తే సుశాంత్ కేసులో అన్ని విషయాలు బయటకు వస్తాయని సుశాంత్ సింగ్ ఫ్రెండ్ యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

కాగా, జూన్ 8న సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ సూసైడ్ చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే అంటే జూన్ 14న సుశాంత్ కూడా తన ఫ్లాట్ లో బలవన్మరణం పొందడం అనేక అనుమానాలను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి ఆత్మహత్యలకు లింక్ పెడుతూ అనేక కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా వీరి మరణానికి కారణమంటూ వార్తలు వచాయి. అయితే ఈ కేసులో సీబీఐ ఎంటర్ అయిన తర్వాత సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై కేసు మళ్లింది. ఆ తర్వాత డ్రగ్స్ చాటింగ్ బయటకు రావడంతో ఎన్సీబీ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసింది.

అయితే ఇటీవల సుశాంత్ సింగ్ ఫ్రెండ్ యువరాజ్ సింగ్ రిపబ్లిక్ టీవీతో మరోసారి ఈ కేసుకి దిశా సలియాన్ కేసుతో సంబంధం ఉందనేలా మాట్లాడాడు. 'ఇది డబుల్ సూసైడ్ కేసు అని అందరికి తెలుసు. సుశాంత్ కేసులో అన్ని విషయాలపై క్లారిటీ రావాలంటే సిబిఐ దిశా సాలియన్ బాయ్ ఫ్రెండ్ రోహన్ రాయ్ ను పట్టుకుని అతనికి నార్కో ఎనాలిసిస్ చేయాలి. అప్పుడే ఈ కేసు ముగుస్తుంది' అని పేర్కొన్నాడు. "ఈ కేసును ఛేదించడానికి మొదటి చేయాల్సింది రోహన్ రాయ్ పట్టుకోవడం. అభిమానులు ఆశను కోల్పోకండి. నిజం త్వరలోనే బయటపడుతుంది "అని యువరాజ్ రిపబ్లిక్ టీవీతో చెప్పారు. సుశాంత్ కేసు రోజుకొక మలుపు తిరుగుతున్న నేపథ్యంలో అతని ప్రెండ్ వ్యాఖ్యలు ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తున్నాయి.
Tags:    

Similar News