మంచంలో ప్రతాపం చూపే వాడే కావాలి

Update: 2015-12-08 01:30 GMT
హై ప్రొఫైల్ లోకి ఎంటర్ అయిపోయిన వాళ్లంతా సాధారణంగా తమ స్టేటస్ ని మరింతగా పెంచుకోవాలనే చూస్తుంటారు. పెళ్లి విషయంలో కూడా తమకు మించిన స్థాయిలో ఉన్నవారినే చేసుకోవాలని ఉబలాటపడుతుంటారు. కానీ అలా కాకుండా.. తనకు మంచంపై ప్రతాపం చూపించే మొగుడు కావాలంటూ ఓ హీరోయిన్ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది.

సల్మాన్ ఖాన్ తో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన జరైన్ ఖాన్.. ఇప్పుడు హేట్ స్టోరీ3లో నటించి పెద్ద షాకే ఇచ్చింది. ఈ సినిమా ప్రచారాన్ని - హైప్ ని పూర్తిగా తనే మోసి.. భారీ ఓపెనింగ్స్ రావడానికి కీలకంగా నిలిచింది. అయితే ఇలా అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీలో చేసినందుకు తనేం ఫీల్ అవడం లేదని చెప్తోంది జరైన్. ఈ మూవీ రిలీజ్ తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయని, అయితే వీటిలో తనకు సూట్ అయ్యే వాటిని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని చెప్పింది.

అదే సమయంలో ఎలాంటి భర్తను కోరుకుంటున్నారని అడిగితే మాత్రం.. బాగా సంపాదించేవాడు అవసరం లేదని, బెడ్ పై చక్కగా పెర్ఫామెన్స్ చేసేవాడు కావాలంటూ చెప్పింది జరైన్ ఖాన్. కావాలంటే తామిద్దరం కలిసి కష్టపడి డబ్బులు సంపాదించుకుంటామని అంటోంది జరైన్. నిజమే కదా..డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. మరి ఇలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అయితే.. తర్వాత బాధ పడాలి కదా. అందుకే ఇలా చెప్పినట్లుంది ఈ భామ.
Tags:    

Similar News