భారీ ధరకు 'మేజర్' ఆడియో రైట్స్..!

Update: 2021-11-18 00:30 GMT
వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ''మేజర్'' షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. తెలుగుతో పాటుగా హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ''మేజర్'' సినిమా అన్ని భాషలకు సంబంధించిన వరల్డ్ వైడ్ మ్యూజిక్ రైట్స్ ను 'జీ మ్యూజిక్' కంపెనీ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. శేష్ కెరీర్ లోనే అత్యధిక ధరకు ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు.

'మేజర్' మ్యూజిక్ రైట్స్ విషయాన్ని హీరో అడివి శేష్ వెల్లడిస్తూ.. ''ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంగీత హక్కులను జీ మ్యూజిక్ కంపెనీ కొనుగోలు చేసిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. మీరు మేజర్ యొక్క ఫైర్ ని ఫీల్ అవుతారు. మీరు అతని ఆవేశాన్ని ఫీల్ అవుతారు. మీరు అతని ప్రేమను ఫీల్ అవుతారు. అతన్ని ఏదీ ఆపలేదు. ఫిబ్రవరి 11న థియేటర్లలోకి వస్తున్నాడు" అని ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.

కాగా, 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. అడవి శేష్ కథ - స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని వివిధ దశలను.. అతని బాల్యం  యుక్తవయస్సు నుండి సైన్యంలో చేరడం వరకు తెలియజేసింది. అంతేకాదు ఈ వార్ డ్రామాపై భారీ అంచనాలు ఉత్కంఠ నెలకొనేలా చేశాయి.

'మేజర్' చిత్రాన్ని GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇందులో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల - బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ తో పాటుగా ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Tags:    

Similar News