25 కోట్లు కూడా రాలేదు!

Update: 2018-12-23 06:52 GMT
లార్జర్ దాన్ లైఫ్ అనే పదానికి నిర్వచనంగా నిలిచే హీరోలనే స్టార్స్ అంటారు ప్రేక్షకులు. జయాపజయాలకు అతీతంగా వీళ్ళను అభిమానించే ఫ్యాన్స్ జీవితంలో ఒక్కసారి ప్రత్యక్షంగా చూసినా చాలు జన్మ ధన్యం అని ఫీలవుతూ ఉంటారు. అలాంటి వాళ్లలో షారుఖ్ ఖాన్ స్థానం చాలా ప్రత్యేకం. టీవీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి నెగటివ్ రోల్స్ నుంచి బాద్షా రేంజ్ కి చేరుకోవడం అంటే మాటలు కాదు. 90వ దశకంలోనే దిల్వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి ప్రేమకథలతో కోట్లాది వసూళ్లు కొల్లగొట్టి యువత గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అలాంటి షారుఖ్ ఖాన్ కి కష్టకాలం వచ్చింది.

2014 లో వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ అసలు హిట్ మొహమే చూడని షారుఖ్ ఖాన్ జీరోతో తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాడనే అనుకున్నారందరూ. అయితే ఆ ఆశల్ని వమ్ము చేస్తూ జీరో గ్రేటెస్ట్ డిజాస్టర్ స్థానం అందుకోవడం కోసం పరుగులు పెట్టడం బాలీవుడ్ లవర్స్ ని బాధ పెట్టేదే. మొదటిరోజు కేవలం 20 కోట్ల 14 లక్షల వసూళ్లు మాత్రమే రాబట్టగలిగిన జీరో ఈ రోజుతో కలిపి వచ్చే వీక్ ఎండ్ లో మొత్తం 50 కోట్ల మార్కును అందుకున్నా గ్రేటేనని ట్రేడ్ సమాచారం.

 అందరూ దుమ్మెత్తిపోసిన తగ్స్ అఫ్ హిందుస్థాన్ దీని కన్నా చాలా బెటర్ గా యాభై కోట్లు రాబడితే అందులో సగం కూడా జీరో అందుకోలేకపోవడం విచారకరం. దీన్ని బట్టే షారుఖ్ ఖాన్ మార్కెట్ ఎంత డేంజర్ జోన్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. కనీసం తనకున్న స్టార్ ఇమేజ్ అయినా ఎంతో కొంత కాపాడుతుంది అనుకుంటే దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తీసికట్టు మేకింగ్ ఆ ఆశల్ని పూర్తిగా నీరుగార్చేసింది. ఇంత భారీ బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరైపోయింది.
Tags:    

Similar News