'కల్కీ 2898' టార్గెట్ చెప్పేసిన నిర్మాత!
రికార్డుల కోసం సినిమా చేయలేదని, 1400 నుంచి 1500 కోట్లు సాధించే అవకాశం ఉందన్నారు.
ఏపీలో వైకాపా ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. వైనాట్ 175 అన్న పార్టీ 11 సీట్లకే పరిమిత మవ్వడంతో దెబ్బ ఏ రేంజ్ లో పడిందో అర్దమవుతుంది. దీంతో ఇండస్ట్రీలో సంతోషం నిండింది. వైకాపా అధికారంలో ఉన్నంత కాలం టికెట్ ధరల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో వాళ్లంతా గుసాయింపుగానే ఉన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్లు అయింది.
ఇండస్ట్రీ మళ్లీ ఇప్పుడు ఊపిరి తీసుకుంటుంది. టికెట్ ధరలు పెంచుకునే వెసులు వాటు ప్రభుత్వం కల్పించింది. తాజాగా ఇటీవలే రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం 'కల్కి 2898' కి భారీగా టికెట్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. టికెట్ ధరలు పెంచడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమాన హీరో కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పకనే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా జగన్ మోహన రెడ్డి ఓటమిని నేను ముందే ఊహించానని నిర్మాత అభిప్రాయపడ్డారు. ఏపీలో తాను ఎవరితో మాట్లాడినా అంతా ముక్త కంఠగా జగన్ దిగిపోవాలనే వారన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండటంతో అశ్వినీదత్ కి నామినేటెడ్ పదవులు వస్తాయి? అన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో దానిపైనా దత్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి కీలకమైన బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగిస్తారని, వాటిని నిర్వర్తించేందుకు తామంతా సిద్దంగా ఉన్నామన్నారు. అలాగే పరిశ్రమ వైజాగ్ లో అభివృద్ది చెందుతుందని దీమా వ్యక్తం చేసారు.
అయితే హైదరాబాద్ ను మాత్రం టాలీవుడ్ వదులకోదని అభిప్రాయపడ్డారు. అలాగే కల్కి ఫలితంపై నా దత్ సంతోషం వ్యక్తం చేసారు. రికార్డుల కోసం సినిమా చేయలేదని, 1400 నుంచి 1500 కోట్లు సాధించే అవకాశం ఉందన్నారు. అలాగే కల్కి 2 కొంత భాగం షూటింగ్ జరిగిందని పూర్తవ్వడానికి మరో ఏడాది సమయం పడుతుందన్నారు.