సీనియర్ ఎన్టీఆర్ ని ఆశ్చర్యపరచిన నిర్మాత సాహసం..!
సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఎంతోమంది పరిశ్రమకు వస్తారు. కొందరు వారిలోని ప్రతిభను ప్రదర్శించడానికి వస్తారు.
సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఎంతోమంది పరిశ్రమకు వస్తారు. కొందరు వారిలోని ప్రతిభను ప్రదర్శించడానికి వస్తారు. ఇండస్ట్రీకి వచ్చే వారంతా కూడా తెర మీద తాము నటించాలి.. ఒక సినిమాను డైరెక్ట్ చేయాలి.. సంగీతంతో ప్రేక్షకులను అలరించాలి.. ఇలా ఏదో ఒక టాలెంట్ తో పరిశ్రమ వైపు అడుగులేస్తారు. కానీ సినిమా నిర్మించడానికి కూడా అదే ఉత్సాహంతో నిర్మాతలు వస్తుంటారు. ఇప్పుడు కాదు అది 50 ఏళ్ల క్రితమే సినిమా మీద ప్యాషన్ తో నిర్మాతని అవుతానని వచ్చి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా నిలబడి ఎంతోమందికి మార్గదర్శకుడిగా మారారు వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వనిదత్.
టీనేజ్ లోనే సినిమాల పైన ఉన్న ఆసక్తితో తండ్రిని ఒప్పించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు అశ్వనిదత్. 19 ఏళ్ల వయసులో సావరిన్ సినీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ లో ఓ సీత కథ సినిమా తీశారు అశ్వనిదత్. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా తీయాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ ని కలిసి చెబితే ఆయన సరదాగా నవ్వేశారు. కానీ పట్టువదలని అశ్వనిదత్ మీతో కచ్చితంగా సినిమా చేస్తానని అన్నారట. నా సినిమా మార్కెట్ తెలుసా నీకని అన్నారట ఎన్టీఆర్ అప్పుడు అశ్వనిదత్ నాకవన్నీ తెలియదు మీతో సినిమా తీయాలంతే అని పట్టుబడ్డారట.
ఆ ఏజ్ లో ఎన్టీఆర్ తో సినిమా అంటే చాలా పెద్ద సాహసమే అని చెప్పాలి. ఇక అశ్వనిదత్ గారి కాన్ఫిడెన్స్ నచ్చి దర్శకుడు బాపయ్య దగ్గరకు పంపి మాట్లాడమని చెప్పారట. అలా ఎన్టీఆర్ తో ఎదురులేని మనిషి సినిమాతో అశ్వనిదత్ ప్రస్థానం మొదలైంది. అంతేకాదు బ్యానర్ పేరు కూడా ఎన్టీఆర్ పెట్టాలని ప్రతిపాదించారట అశ్వనిదత్. ఇంతకీ బ్యానర్ పేరేంటి అంటే మీరే పెట్టండని అనగా.. కృష్ణుడి మెడలో మాలని వైజయంతి అంటారని.. ఆ పేరు మీదగా వైజయంతి మూవీస్ అని ఫిక్స్ చేశారట. అలా 50 ఏళ్ల క్రితం మొదలైన అశ్వనిదత్ సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతుంది.
ప్రస్తుతం ఆయన కూతుళ్లతో కలిసి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ తో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. అశ్వనిదత్ సినిమా అంటే చాలు సినిమా గ్రాండియర్ గా ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ బ్యానర్ లో కల్కి 2898 ఏడి సినిమా వస్తుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా భారీ అంచనాలతో వస్తుంది.