వైట్ అండ్ వైట్లో ఇచ్చి పడేసిందిగా
ఈ స్టార్ డాటర్ అందం హొయలు మతులు చెడగొడుతున్నాయ్.
కవులు కాని వారు కూడా కాళిదాసులైపోతారు ఈ అందాన్ని చూస్తే. బికినీలు స్విమ్ సూట్లు వేస్తేనే హాట్ గా ఉన్నట్టా..? అప్పుడప్పుడు తెల్ల చొక్కాల్లో కూడా అంతే వేడి పెంచేయొచ్చు అని నిరూపిస్తోంది జాన్వీ కపూర్. ఈ స్టార్ డాటర్ అందం హొయలు మతులు చెడగొడుతున్నాయ్.
కెరీర్ ఆరంభం చిట్టి పొట్టి నిక్కర్లతో మతులు చెడగొట్టిన జాన్వీ కపూర్ తనకంటూ భారీ ఫాలోయింగ్ వచ్చాక మాత్రం నెమ్మదిగా ఫ్యాషన్ సెన్స్ పరంగా పరిణతితో వ్యవహరిస్తోంది. డీసెంట్ గా కనిపిస్తూనే, మాస్ ని టచ్ చేయడమెలానో చేసి చూపిస్తోంది.
తాజాగా వైట్ అండ్ వైట్ లుక్ లో జాన్వీ కపూర్ కుర్రాళ్ల గుండెల్లో మంటలు పెట్టింది. సింపుల్ గా వైట్ డిజైనర్ షర్ట్ ధరించి కాంబినేషన్ బ్లాక్ జీన్స్ తో మెరిసిపోయింది ఈ బ్యూటీ. ఫ్రీస్టయిల్ లో తనలోని ఫ్యాషనిస్టా కంటెంట్ ని జాన్వీ ఎలివేట్ చేసిన తీరు ఆశ్చర్యపరిచింది. ఆ అందమైన నేరేడు కళ్లను చక్రాల్లా తిప్పుతూ హార్ట్ బీట్ ని లయ తప్పేలా చేసింది ఈ అమ్మడు. మొత్తానికి దేవర చిత్రంతో తెలుగు యువత గుండెల్ని ముక్క చెక్కలు చేయడమెలాగో ప్రాక్టికల్ గా చూపిస్తుందనే భావించాలి. ప్రస్తుతం ఈ హాట్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.