రాజ్ తరుణ్ వ్యక్తిగత గొడవ దర్శకుల రియాక్షన్ ఏంటీ?
మరోవైపు ఏ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్ తరుణ్ తిరగబడరా సామి మూవీలో నటించారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రామ్ భీమన దర్శకత్వంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆయన కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ థియేటర్స్ లోకి రావడం విశేషం. మూవీపై ట్రైలర్, సాంగ్స్ తో కొంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఏ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్ తరుణ్ తిరగబడరా సామి మూవీలో నటించారు.
ఈ సినిమా ఆగస్టు ఫస్ట్ వీక్ లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. రెండు వారాల గ్యాప్ లోనే రాజ్ తరుణ్ నుంచి రెండు సినిమాలు మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్న ఇప్పుడు రాజ్ తరుణ్ ఈ సినిమాలను కనీసం ప్రమోషన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అతనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పెట్టింది. లావణ్య ఇచ్చిన ఆధారాల బేస్ చేసుకుని పోలీసులు కూడా కేసు నమోదు చేసి రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చారు.
అయితే ఇప్పటివరకు రాజ్ తరుణ్ మాత్రం ఈ నోటీసులపై స్పందించలేదు. తిరగబడరా స్వామి సినిమాలో రాజ్ తరుణ్ కి జోడిగా నటించిన మాల్వీ మల్హోత్రా తో అతనికి ఇల్లీగల్ ఎఫైర్ ఉందని లావణ్య ఆరోపిస్తుంది. అలాగే 11 ఏళ్లు తనతో సహజీవనం చేసి ఇప్పుడు హీరోయిన్ తో అఫైర్ పెట్టుకొని తనని దూరం చేస్తున్నారని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి పేరుతో తనని గర్భవతిని చేశాడని కూడా లావణ్య ఆరోపిస్తుంది. రాజ్ తరుణ్ కి చాలామంది హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నాయని ఆరోపణలు చేసింది.
రాజ్ తరుణ్ మాత్రం వీటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఈ సినిమాల రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కి వస్తే ఖచ్చితంగా మీడియాని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సినిమా గురించి కాకుండా వ్యక్తిగత విషయాలు మీదే మీడియా ప్రతినిధులు అందరూ కూడా రాజ్ తరుణ్ ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని అతను ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నారు. ఈ చిత్రాల దర్శకులు కూడా రాజ్ తరుణ్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు.
రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితంలోని ఇబ్బందులు గురించి అతను మాత్రమే మీడియా ముందుకొచ్చి మాట్లాడుతారని చెప్తున్నారు. వీటిపై తాము ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పేస్తున్నారు. వ్యక్తిగత వివాదం కారణంగానే సినిమా ప్రమోషన్స్ కి కూడా రాజ్ తరుణ్ దూరంగా ఉన్నారని పురుషోత్తముడు సినిమా డైరెక్టర్ రామ్ భీమన ఇప్పటికే చెప్పారు. తాజాగా ఏఎస్ రవికుమార్ చౌదరి కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా బంధంపై తాను స్పందించలేనని స్పష్టం చేశారు. ఈ వివాదంపై కేవలం రాజ్ తరుణ్ మాత్రమే క్లారిటీ ఇచ్చుకుంటారని చెప్పారు. సినిమాకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలని మీడియా ప్రతినిధులకి రవికుమార్ చౌదరి కూడా స్పష్టం చేశారు. ఈ రాజ్ తరుణ్ వివాదం కాస్త ఇప్పుడు అతని సినిమాలకు తలనొప్పిగా మారింది. అసలే అంతంత మాత్రంగా అతని మార్కెట్ ఉంది. ఇలాంటి పరిస్థితిలో కనీసం తన సినిమాలని ప్రమోషన్ చేసుకోలేని స్థితిలో రాజ్ తరుణ్ ఉన్నారు. ఈ ప్రభావం సినిమాల రిజల్ట్ పై పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.