కిస్సిక్‌ వైరల్‌ బ్యూటీ ఎవరో తెలిసింది

బన్నీ పక్కన శ్రీలీల చేసిన కిస్సిక్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో వైరల్‌ అయ్యిందో ఊర్వశితో బన్నీ చేసిన మూమెంట్స్ సైతం అదే స్థాయిలో వైరల్‌ అయ్యాయి.

Update: 2024-12-29 12:30 GMT

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. ఇప్పటికే రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు సంబంధించిన ఏ వీడియో అయినా, ఈ ఏవిషయం అయినా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా చిత్ర యూనిట్‌ నుంచి కిస్సిక్ సాంగ్‌కి సంబంధించి మేకింగ్‌ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో అల్లు అర్జున్‌తో శ్రీలీల కాకుండా మరో అమ్మాయి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. సాధారణంగా షూటింగ్‌కి ముందు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్స్‌ ప్రాక్టీస్ చేస్తారు, ఆ తర్వాత మెయిన్‌ లీడ్‌ పై షూటింగ్‌ చేస్తారు అనే విషయం తెల్సిందే.

ఆ వీడియోలో కనిపించిన పింక్ బ్యూటీని ఎవరూ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ అనుకోలేదు. ఆమెను హీరోయిన్‌గానే అనుకున్నారు. ఆమె గురించి సోషల్‌ మీడియాలో చాలా మంది ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఆమె ఎవరో తెలిసి పోయింది. ఆమె హీరోయిన్ కాదు, ఆమె అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌. కిస్సిక్‌ సాంగ్‌కి ఆమె అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించింది. ఆమె పేరు ఊర్వశి అప్సర. గతంలోనూ పలు సినిమాలకు ఈమె వర్క్ చేసింది. అందంతో పాటు, డాన్స్‌లో ఈమె హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసి పోదు అంటూ చాలా మంది ఇండస్ట్రీలో అంటూ ఉంటారట. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈమె గురించి మరింత చర్చ మొదలైంది.

బన్నీ పక్కన శ్రీలీల చేసిన కిస్సిక్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో వైరల్‌ అయ్యిందో ఊర్వశితో బన్నీ చేసిన మూమెంట్స్ సైతం అదే స్థాయిలో వైరల్‌ అయ్యాయి. ఊర్వశి గురించి చాలా మంది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఏకంగా ఆమెను హీరోయిన్‌గా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో తెలుగు కుర్రాళ్లకు తెగ కిక్‌ ఇస్తున్న ముద్దుగుమ్మ ఊర్వశి ముందు ముందు మరిన్ని సాంగ్స్‌కి వర్క్ చేయాలని కొందరు కోరుకుంటూ ఉంటే కొందరు మాత్రం ఇంతటి అందం హీరోయిన్‌గా చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.

గణేష్‌ ఆచార్య వద్ద చాలా కాలంగా అసిస్టెంట్‌గా చేస్తున్న ఊర్వశి అప్సర గతంలో పుష్ప సినిమా కోసం వర్క్‌ చేసింది. ఊ అంటావా మావా పాటకి సైతం బన్నీతో కలిసి స్టెప్స్‌ వేసి సమంతకు చూపించింది. ఇప్పుడు శ్రీలీలకు చూపించడం కోసం అల్లు అర్జున్‌తో స్టెప్స్‌ వేయడం ద్వారా వైరల్‌ అయ్యింది. అప్పుడు పెద్దగా ఈమె గురించి బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఈమె గురించి ప్రముఖంగా చర్చ నడుస్తోంది. ఓవర్‌ నైట్‌లో సెలబ్రెటీ హోదాను సొంతం చేసుకున్న ఊర్వశి బెల్లి డాన్స్‌లో మంచి ప్రావిణ్యం సొంతం చేసుకుందట. భవిష్యత్తులో సొంతంగా కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుందా లేదంటే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందో చూడాలి. మొత్తానికి ఏడాది చివర్లో ఊర్వశి సోషల్‌ మీడియా సెన్షేషన్‌గా నిలిచింది.

Tags:    

Similar News