కుటుంబ పరువు దిగజార్చిందంటూ నటిపై అత్త ఫైర్!
మొన్నటికి మొన్న హై-వోల్టేజ్ బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత, కంటెస్టెంట్స్ కలిసి పార్టీ చేసుకుంటూ చిల్లింగ్ అయిన వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ అయింది.
సదరు యువనటి నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకి వస్తోంది. ఇటీవల నైట్ పార్టీలతోను చెలరేగి వార్తల్లో వ్యక్తి అవుతోంది. మొన్నటికి మొన్న హై-వోల్టేజ్ బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత, కంటెస్టెంట్స్ కలిసి పార్టీ చేసుకుంటూ చిల్లింగ్ అయిన వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ అయింది.
ఈ వీడియోలో సదరు టీవీ మూవీ నటి తన సహచరుడితో కలిసి పార్టీ మూడ్ లో చిల్లింగ్ గా కనిపించింది. సహచరుడితో కలిసి ఫుల్ గా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెలబ్రిటీ క్రౌడ్ లో ఇలాంటి చాలా సాధారణమే అయినా కానీ అప్పటికే పెళ్లయిన సదరు నటీమణి మత్తులో తూగుతూ అతడిపై చెయ్యి వేసి పెదవి ముద్దును ఆఫర్ చేస్తూ కనిపించిన ఫోటోలు హీట్ పుట్టించాయి.
అంతేకాదు ఇదే పార్టీలో తన భర్త కూడా ఉన్నారు. అయినా పార్టీ మత్తులో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితిలో సదరు భామ కనిపించింది. ఇప్పుడు ఈ వీడియోపై అభిమానులు కలతకు గురయ్యారు. దీనిపై ఎవరికి వారు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. అంతేకాదు..సదరు టీవీ నటి అత్తగారి స్పందనను ప్రస్తావిస్తూ అభిమానులు వీడియోపై విరుచుకుపడ్డారు. ఫ్యాన్స్ లో ఒకరు ``ఆమె తల్లిని పిలవడానికి తన భర్త తండ్రి వెళుతున్నాడు`` అని రాసాడు.
ఇక బిగ్ బాస్ హిందీ ఇంటి సభ్యురాలిగా పోటీలో ఉన్న ఈ బ్యూటీని లైవ్ లోనే అత్తగారు చెడామడా తిట్టేసింది. తన కోడలి వ్యవహారికాన్ని తీవ్రంగా తప్పుపడుతూ విమర్శించింది. అంతేకాదు... జైన్ కుటుంబ ప్రతిష్టను దిగజార్చే షోలలో పాల్గొననని వాగ్దానం చేయమని అత్తగారు నిలదీసింది. దీంతో హోస్ట్ ముందే తన కుటుంబాన్ని ఆదుకుంటానని .. జీవితాంతం తన భర్త తో కలిసే ఉంటానని ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చింది. బిగ్ బాస్ పేరుతో పాశ్చాత్య ధోరణి పెట్రేగిపోతోంది. బంధాలు అనుబంధాలు విచ్ఛిన్న దశకు చేరుకున్న వైనం కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లయిన యువతీయువకుల మధ్య కట్టుబాట్లు ఇప్పుడు విచ్ఛిన్నమవుతుండడం చాలా ప్రమాదకరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.