అల్లుకుపోయిన మిస్టర్ బచ్చన్ జోడి.. వ్వాటే పోస్టర్!

ఈ పోస్టర్ ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. ఒక పెద్ద బిందెపై కూర్చున్న రవితేజను హీరోయిన్ అల్లేసుకున్న విధానం మంచి రొమాంటిక్ ఫీల్ ను కలిగిస్తోంది.

Update: 2024-08-05 14:26 GMT

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమాషూటింగ్ ఫినిష్ అయ్యింది. సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ ఓ వైపు ప్రమోషన్స్ చేస్తూనే మరోవైపు షూటింగ్ పనులను కొనసాగించారు. ఫైనల్ గా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 15న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది.

 

ఇక విడుదల సమయం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగంగా కొనసాగిస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమా మాస్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలను సమ్మిళితంగా కలిగిన చిత్రంగా రూపొందించబడిందని పోస్టర్స్ చూస్తేనే అర్ధమవుతుంది. రవితేజ మరియు భగ్యశ్రీ బోర్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఇటీవల విడుదలైన కొత్త రొమాంటిక్ పోస్టర్‌లో రవితేజ, భగ్యశ్రీలు కలిసి ఉండటం, ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్ట్రాటజిక్‌గా డిజైన్ చేయబడింది. ఈ పోస్టర్ ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. ఒక పెద్ద బిందెపై కూర్చున్న రవితేజను హీరోయిన్ అల్లేసుకున్న విధానం మంచి రొమాంటిక్ ఫీల్ ను కలిగిస్తోంది. సినిమాలో వీరి కెమిస్ట్రీ ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతోందనేది ఈ పోస్టర్ ద్వారా అర్ధమవుతుంది.

ఇక ఆగస్ట్ 7న ట్రైలర్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ద్వారా రొమాంటిక్, యాక్షన్ అంశాలను చూపించారు. అయితే, ట్రైలర్‌ ద్వారా సినిమా కథను మరింత విపులంగా చూపించనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి.జి. విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కథ పరంగా రవితేజ ఆదాయపు పన్ను అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది.

సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. హరీష్ శంకర్ షూటింగ్ ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా హరీష్ శంకర్, మిస్టర్ బచ్చన్ షూట్ పూర్తి అయిందని చెనుతూ.. ఆఖరి రోజు చివరి పాట షూట్‌ కూడా పూర్తయిందని అన్నారు. ఇక 14న ప్రీమియర్స్, 15న గ్రాండ్ రిలీజ్‌కి సూపర్ ఎక్సైటెడ్‌గా ఎదురుచూస్తున్నా. మా నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి, ఆయన అందించిన అపారమైన సపోర్ట్‌కి నేనెప్పటికీ రుణపడి ఉంటా," అని పేర్కొన్నారు. మొత్తం మీద మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రవితేజ అభిమానులు ఈ మూవీతో మరో హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News