బిగ్ బాస్ 8 : ఆమెను రిస్క్ లో పెట్టిన అవినాష్.. చివరికి ఎలిమినేట్ కూడా..?

అందులో ఓడినందుకు ప్రేరణ డైరెక్ట్ నామినేట్ అయ్యింది.

Update: 2024-10-17 05:04 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. రాయల్ క్లాన్ నుంచి ముగ్గురు తేజ, గౌతం, హరితేజ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఓజీ క్లాన్ నుంచి యష్మి, పృధ్వి, నిఖిల్, ప్రేరణ, నబీల్, మణికంఠ నామినేషన్స్ లో ఉన్నారు. రాయల్ క్లాన్ గురి చూసి మరీ ఓజీ క్లాన్ సభ్యులను నామినేట్ చేయడం జరుగుతుంది. ఐతే ఈ నామినేషన్స్ లో కిల్లర్ గాళ్స్ గా ప్రేరణ, హరితేజలకు క్యాప్ పెట్టుకునే టాస్క్ ఇచ్చాడు. అందులో ఓడినందుకు ప్రేరణ డైరెక్ట్ నామినేట్ అయ్యింది.

ఐతే అవినాష్ కూడా నామినేషన్స్ లో ఉండగా అతని దగ్గర నామినేషన్స్ షీల్డ్ ఉండటం వల్ల అతను దాన్ని వాడుకున్నాడు. ఐతే ఐతే అతను సేవ్ అవ్వాలంటే ఆ నామినేషన్ షీల్డ్ వాడుకుని తను సేవ్ అయ్యి హరితేజని స్వాప్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 1 లో హరితేజ చాలా పాపులర్ అయ్యింది. ఆ సీజన్ లో ఆమె హరికథ బాగా ఫేమస్. దాదాపు ఆ సీజన్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఆమెకే ఉన్నాయన్నట్టుగా బజ్ ఏర్పడింది.

ఐతే సీజన్ 8 లో మాత్రం హరితేజ పర్ఫార్మెన్స్ అంతగా ఏమి లేదు. వచ్చి రెండు వారాలు అవుతున్నా ఆమె తన మార్క్ చూపించలేకపోతుంది. అంతేకాదు ఈ వారం నామినేషన్స్ లో ఉన్న హరితేజకే లీస్ట్ ఓటింగ్ వచ్చినట్టు బయట ఓటింగ్ అనాలిసిస్ లు చెబుతున్నాయి. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో గౌతం, తేజ, హరితేజ ఈ ముగ్గురే లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు. వీరిలో హరితేజ చివరి స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది.

మరి హరితేజ ఎలిమినేషన్ జరుగుతుందా లేదా మిగతా ఇద్దరిలో ఎవరైనా బయటకు వస్తారా అన్నది ఆదివారం తెలుస్తుంది. రాయల్ క్లాన్ నుంచే ఈ వారం ఎలిమినేషన్ జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఛార్జెస్ అనే టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్ లో ఎవరు గెలిస్తే వారు చీఫ్ కంటెండర్ గా నిలుస్తారు. ఆల్రెడీ చీఫ్ కంటెండర్ గా గంగవ్వ నిలిచింది. మరి ఈ వారం మెగా చీఫ్ ఎవరు అవుతారన్నది ఈ రెండు రోజుల్లో తెలుస్తుంది.

Tags:    

Similar News