ఫోటో స్టోరి: బికినీ బీచ్‌లో కిల్లర్ వైరస్
ప్రస్తుతం సోషల్ మీడియాల్లోను అవ్ నీత్ హైస్పీడ్ తో దూసుకుపోతోంది. తాజాగా అవ్ నీత్ బీచ్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది
ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో తన అంతర్జాతీయ చలనచిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన అతి పిన్న వయస్కురాలిగా నటి అవ్నీత్ కౌర్ ఒక గొప్ప మైలురాయిని సాధించింది. కేన్స్‌లో అద్భుత అరంగేట్రం కెరీర్లో ఒక ముఖ్యమైన ఘట్టం. అంతర్జాతీయ చిత్రం లవ్ ఇన్ వియత్నాం తన ఫేట్ ని మారుస్తుందని అవ్ నీత్ నమ్ముతోంది. గ్లామ్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో ఎదుగుతున్న ధృవతారగా ఇది తొలి పెద్ద అడుగు.
ప్రస్తుతం సోషల్ మీడియాల్లోను అవ్ నీత్ హైస్పీడ్ తో దూసుకుపోతోంది. తాజాగా అవ్ నీత్ బీచ్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. బ్లూ బికినీ ధరించి కాంబినేషన్ గా వైట్ హ్యాట్ ని షేడ్స్ ని ధరించిన అవ్ నీత్ లుక్ కి అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. అవ్ నీత్ కిల్లింగ్ అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. చాలా మంది అభిమానులు లవ్ హార్ట్ ఈమోజీలను షేర్ చేస్తున్నారు. అవ్ నీత్ టూ హాట్ గా ఉందంటూ బోయ్స్ కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
తాజా ఇంటర్వ్యూలో అవ్ నీత్ మాట్లాడుతూ.. ``లవ్ ఇన్ వియత్నాం భారతీయ, అంతర్జాతీయ సినిమాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఈ చిత్రం ప్రపంచ ప్రేక్షకులకు మన ప్రతిభను ప్రదర్శించడానికి ఉన్న ఒక అవకాశంగా భావిస్తున్నాం`` అని తెలిపింది.
లవ్ ఇన్ వియత్నా .. భారత్- వియత్నాం నేపథ్యంలో ప్రేమకథా చిత్రం. రహత్ షా కజ్మీ రచన & దర్శకత్వం వహించారు. ఒమంగ్ కుమార్, కెప్టెన్ రాహుల్ బాలి, అభిషేక్ అంకుర్లతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. దీనిని తారిఖ్ ఖాన్, జెబా సాజిద్, సామ్టెన్ హిల్స్, అసోసియేట్ ప్రొడ్యూసర్ వికాస్ శర్మ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.