యాక్షన్ చిత్రాల్ని వాళ్లిద్దరే ఇలా పంచుకుంటారా?
బాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకు ఇప్పుడా ఇద్దరు బ్రాండ్ గా మారారా? స్టార్ హీరోలతో యాక్షన్ సినిమాలు చేస్తే తాము మాత్రమే చేయాల్సిందిగా రూలింగ్ నడుస్తుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది.
బాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకు ఇప్పుడా ఇద్దరు బ్రాండ్ గా మారారా? స్టార్ హీరోలతో యాక్షన్ సినిమాలు చేస్తే తాము మాత్రమే చేయాల్సిందిగా రూలింగ్ నడుస్తుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. `బ్యాంగ్ బ్యాంగ్` తో సిద్దార్ధ్ ఆనంద్ యాక్షన్ వరల్డ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. `బ్యాంగ్ బ్యాంగ్` విజయం తర్వాత ఆనంద్ యాక్షన్ అనేది తన ఇంటి పేరుగా మారిపోయింది. అటుపై తెరకెక్కించిన `వార్` భారీ విజయం సాధించింది.
అనంతరం `పఠాన్` తో మరో సంచలనం నమోదు చేసాడు. గత ఏడాది `ఫైటర్` తోనే దుమ్ముదులిపేసాడు. ఇలా నాలుగు విజయాలతో సిద్దార్ధ్ ఆనంద్ బాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకు ఓ బ్రాండ్ గా మారాడు. అటు `బ్రహ్మాస్త్ర` తో ఆయాన్ ముఖర్జీ యాక్షన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి ప్రయత్నం ఫెయిలైనా యాక్షన్ మేకర్ గా మాత్రం మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే హృతిక్ రోషన్ తో `వార్ 2` డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. అయితే ఆనంద్...ఆయాన్ ఇద్దరు యాక్షన్ చిత్రాల్ని ఒకరికొకరు షేర్ చేసుకోవడం విశేషం. ఒక భాగాన్ని ఒకరు డైరెక్ట్ చేస్తే సీక్వెల్ ని మరొకరు డైరెక్ట్ చేస్తున్నారు. `వార్` చిత్రాన్ని తొలుత సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేసాడు. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న `వార్ 2`ని ఆయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. `పఠాన్` చిత్రాన్ని సిద్దార్ధ్ తెరకెక్కించాడు.
ఇప్పుడు పఠాన్ సీక్వెల్ కోసం ఆయాన్ ముఖర్జీని తీసుకున్నారు. ఇలా యాక్షన్ ప్రాంచైజీ విషయంలో ఆయాన్..ఆనంద్ ఇద్దరు మంచి కోఆర్డినేషన్ తో పని చేస్తున్నారు. రోహిత్ శెట్టి లాంటి డైరెక్టర్ మరొకరు ఉన్నా? ఆ ఛాన్స్ మరొకరికి వెళ్లకుండా ఆయాన్-ఆనంద్ మధ్యనే ఉండేలా ప్లాన్డ్ గా ముందుకెళ్తున్నారు.