సినిమాల్లోకి రాజేంద్రప్రసాద్ మనమరాలు.. రిలీజ్ ఎప్పుడంటే?

ఇప్పుడు ఆయన మనమరాలు బేబీ సాయి తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఫస్ట్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Update: 2024-10-12 09:06 GMT

టాలీవుడ్ లోకి ఎందరో నటీనటుల వారసులు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్నారు. అయితే నట కిరీటి రాజేంద్రప్రసాద్ వారసులు.. మాత్రం సినిమాల్లోకి రాలేదు. అందుకు కారణాలు ఏమైనా.. తెరంగేట్రం చేయలేదు. ఇప్పుడు ఆయన మనమరాలు బేబీ సాయి తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఫస్ట్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర – The Beginningతో తేజస్విని సినిమాల్లోకి అడుగుపెడుతోంది. సుమన్ బాబు స్వీయ దర్శకత్వం చేస్తూ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్ అండ్ యాక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా.. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్స్ ను పూర్తి చేసుకుంది.

విజయదశమి సందర్భంగా నేడు ఎర్రచీర – The Beginning మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 20వ తేదీన తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. సినిమాలో 45 నిమిషాల పాటు కళ్లు చెదిరే గ్రాఫిక్స్ తో సీన్స్ ఉన్నాయని, అవి అందరినీ ఆకట్టుకుంటాయని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. క్లైమాక్స్ లో ఉన్న మదర్ సెంటిమెంట్ అందరికీ కన్నీరు తెపిస్తుందని చెప్పారు

మూవీలో కారుణ్య చౌదరి సరికొత్తగా కనిపించబోతుందని సుమన్ బాబు అన్నారు. బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని నిర్మాత ఎన్ వీవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సినిమాలో తేజస్విని, కారుణ్య చౌదరితో పాటు శ్రీరామ్, కమల్ కామరాజు, అయ్యప్ప పీ శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్ చిన్న అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ప్రమోద్ పులిగార్ల తనదైన శైలిలో బాణీలు సమకూర్చారు.

అయితే రాజేంద్రప్రసాద్ మరో మనవరాలు నిశంకర ఇప్పటికే సినిమాల్లోకి వచ్చింది. మహానటి చిత్రంలో అల్లరి పిల్ల బుల్లి సావిత్రిగా అలరించింది. ఎంతో చెలాకీగా నటిస్తూ ఆకట్టుకుంది. చిన్నారి సావిత్రి పాత్రలో ఆమె భలే ఒదిగిపోయింది. మంచి పేరు సంపాదించుకుంది. మరిన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది! ఇప్పుడు బేబీ సాయి తేజస్విని.. తన లక్ ను టెస్ట్ చేసుకుంటోంది. మరి ఆమె డెబ్యూ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News