బేబీ కథను రిజెక్ట్ చేసిన ముగ్గురు హీరోలు
అయితే ఆ సినిమా తర్వాత అతనికి పేరు వచ్చింది
హృదయ కాలేయం సినిమా పోస్టర్ చూసినప్పుడే అసలు ఇలాంటి సినిమా ఎవరైనా తీస్తారా? అని చాలామంది కామెంట్స్ చేశారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అసలు ఆ రిజల్ట్ ఎవరికి అర్థం కాలేదు. నిజానికి అలాంటి డిఫరెంట్ కామెడీ సినిమా అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా రాలేదు. సరికొత్త తరహాలో సంపూర్ణేష్ బాబును పరిచయం చేసిన దర్శకుడు సాయి రాజేష్ ఊహించిన స్థాయిలో సక్సెస్ అయితే అందుకున్నాడు.
అయితే ఆ సినిమా తర్వాత అతనికి పేరు వచ్చింది కానీ పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. రైటర్ గా కూడా చాలా అవకాశాలు వచ్చినప్పటికీ సాయి రాజేష్ పెద్దగా రిస్కులు చేయలేదు. ఇక మధ్య మధ్యలో కలర్ ఫోటో అంటూ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకొని సక్సెస్ అయ్యాడు. అలాగే తన శిష్యులను మరికొందరిని డైరెక్టర్స్ గా పరిచయం చేసి సంపూర్ణేష్ బాబు తోనే మరి కొన్ని సినిమాలు తీశాడు. అవి కూడా పరవాలేదు అనిపించాయి.
అయితే బేబీ సినిమా కథ రాసుకున్నప్పుడు సాయి రాజేష్ ఈ కథను రాశారు అంటే ఎవరు నమ్మలేదు. అంత కామెడీ సినిమా తీసిన సాయి రాజేష్ ఇంత డెప్త్ లవ్ స్టోరీని అసలు హ్యాండిల్ చేయగలడా లేదా అనే అనుమానాలు కూడా మొదటి చాలా మందికి వచ్చాయట. కానీ నిర్మాత SKN మాత్రం అతనిని గట్టిగానే నమ్మాడు. ఇక సాయిరాజేష్ మొదట ఈ కథను రాసుకున్నప్పుడు ఆనంద్ దేవరకొండ కంటే ముందే ముగ్గురు హీరోలను అనుకున్నాడట.
కానీ వాళ్ళు ఈ సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించలేదట. ముఖ్యంగా ఒక హీరో కథ విన్న తర్వాత ఇంత పెద్ద రిస్క్ నేను చేయలేను అని ఓపెన్ గా చెప్పేసాడట. ఇక మరొక హీరో అయితే నిర్మాణం సంస్థ నుంచి ఫోన్ చేయగానే దర్శకుడు సాయి రాజేష్ అయితే అసలు చేయను అని కూడా అన్నాడట. అప్పుడు సాయి రాజేష్ చాలా బాధపడినట్లు తెలియజేశాడు.
ఎందుకంటే హృదయ కాలేయం లాంటి సినిమా చేసినప్పుడు ఆ ముద్ర చాలా బలంగా పడింది. ఆ మాట వినగానే ఆరోజు మొత్తం నాకు నిద్ర కూడా పట్టలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే బేబీ సినిమా కంటే హృదయ కాలేయం లాంటి సినిమాను హ్యాండిల్ చేయడం చాలా కష్టతరం అని సాయిరాజేశ్ తెలియజేశాడు.
అలాగే బేబీ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా మ్యూజిక్ డైరెక్టర్ అలాగే నటీనటులకు మిగతా టెక్నీషియన్స్ కు కూడా పేరు వస్తుంది కానీ దర్శకుడిగా తనపై మాత్రం చాలా ఎఫెక్ట్ చూపించే రిస్క్ కూడా ఉండేదని అంటూ.. అయినప్పటికీ ఈ సినిమాను ఎలాగైనా తెరపైకి తీసుకురావాలని అనుకున్నట్లుగా సాయి రాజేష్ తెలియజేశాడు.