మంచి హీరోలు మోసపోతే.. హిట్టే!
మరోవైపు ట్రెండ్‌తో సంబంధం లేకుండా కూడా అడపాదడపా సేమ్ ఫార్ములాతో వచ్చే కొన్ని చిత్రాలు కూడా మంచి హిట్‌ను అందుకుంటుంటాయి. ఇప్పుడు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న 'బేబీ' మూవీ కూడా అంతే.
ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. ఆ సయయంలో ఆయా జానర్ సినిమాలు బాగా క్లిక్ అవుతుంటాయి. ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తుంటాయి. మరోవైపు ట్రెండ్‌తో సంబంధం లేకుండా కూడా అడపాదడపా సేమ్ ఫార్ములాతో వచ్చే కొన్ని చిత్రాలు కూడా మంచి హిట్‌ను అందుకుంటుంటాయి. ఇప్పుడు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న 'బేబీ' మూవీ కూడా అంతే.
ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో హీరోయినే మెయిన్ ఫోకస్. ప్రేమను చూపిస్తూనే.. బ్యాడ్ టచ్ ఉన్న నెగటివ్ అండ్ బోల్డ్ షేడ్స్‌లో చూపించారు. అంటే హీరోను ఊహించని విధంగా మోసం చేసే పాత్రలో చూపించారు. ఈ రోల్ సినిమాలో బాగా పండింది. యూత్ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పుడీ చిత్రం మంచి వసూళ్లను అందుకుంటోంది.
అయితే గతంలో ఇలాంటి ఫార్ములాతో వచ్చిన చాలా సినిమాలు కూడా బాగానే ఆడాయి. అప్పుడెప్పుడో వచ్చిన తమిళ డబ్బింగ్ మూవీ 'మన్మథ'తో మొదలై.. ఇప్పటికీ నెగటివ్ అండ్ బోల్డ్ హీరోయిన్ ఫార్మూలా కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ ఆడియెన్స్ అటెన్షన్‌ను బాగా క్యాచ్ చేశాయి. అందుకే దర్శకనిర్మాతలు అప్పుడప్పుడు దీనిని కొనసాగిస్తూ.. దానికి ఇంకాస్త తమ టాలెంట్‌ను జోడించి ప్రేక్షకల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ పల్స్‌ను బాగా పట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకుంటున్నారు.
అప్పట్లో యూత్‌ను ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న 'కుమారి 21 ఎఫ్'లోనూ హీరోయిన్ హెబ్బా పటేల్‌ను కాస్త హై కల్చర్ ఉన్న బోల్డ్ అండ్ నెగటివ్ షేడ్స్‌లో చూపించారు. ఆ పాత్ర బాగా కనెక్ట్ అయింది. అయితే ఇందులో ఆమెది హీరోను మోసం చేసే పాత్ర కాదు. కానీ ఆ తర్వాత వచ్చిన 'ఆర్ఎక్స్ 100'(పాయల్ రాజ్‌పుత్), 'డీజే టిల్లు'లో(నేహాశెట్టి) హీరోయిన్స్‌ను పక్కాగా హీరోలను ప్రేమలో దించుతూనే మోసం చేసే పాత్రలో బాగా చూపించారు. వీటన్నింటిలో హీరోయిన్స్ బోల్డ్ అండ్ నెగటివ్ షేడ్స్‌లో చూపించారు. వాస్తవానికి ఈ సినిమాల కథలన్నీ ఒకదానికి ఇంకోటి సంబంధం ఉండదు. కానీ మెయిన్ థీమ్ ఒకటే. లవ్ జానర్లో నెగటివ్ అండ్ బోల్డ్ హీరోయిన్ ఫార్మూలతో వచ్చినవ్వే. ఈ చిత్రాలన్నింటిలో హీరో.. హీరోయిన్ను పీకల్లోతూగా వెళ్లి ప్రేమిస్తే.. కథానాయిక మాత్రం మొదటి నుంచి అతడి కోసమే ఉంటున్నట్టు నటించి చివరికి తన అసలు రూపాన్ని బయటపెడుతుంది.
అయితే ఈ కాన్సెప్ట్‌తో వచ్చిన అన్నీ చిత్రాలు హిట్ అయ్యాయి అని కూడా చెప్పలేం. ఎందుకంటే కథ చెప్పే విధానం చూపించే విధానం, నటీనటుల పెర్ఫార్మెన్స్, పాటలు, సంగీతం, సినిమా మార్కెటింగ్.. ఇలా అన్నీ కలిసొస్తేనే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. అప్పుడే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. పైన చెప్పుకున్న సినిమాల్లో ఈ అంశాలన్నీ ప్రేక్షకుల్ని బాగా మెప్పించాయి. ముఖ్యంగా మ్యూజికల్‌గా సెన్సేషనల్ సృష్టించాయి.