అల్లరి నరేష్ బచ్చల మల్లి.. టిక్కెట్ రేట్లు ఇవే..

అయితే నైజాంలో బచ్చల మల్లి మూవీకి గాను టికెట్ ధరలను మల్టీప్లెక్స్ లో రూ.180గా, సింగిల్ థియేటర్ లో రూ.150గా నిర్ణయించారు.

Update: 2024-12-19 12:50 GMT

టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లరి నరేష్.. మరికొద్ది గంటల్లో బచ్చల మల్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. మూవీపై అందరి దృష్టి పడేలా చేశాయి.

నిజ జీవిత వ్యక్తి కథ ఆధారంగా రూపొందిన బచ్చల మల్లిలో అల్లరి నరేష్.. ఊరమాస్ అవతార్ లో కనిపించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ప్రమోషనల్ కంటెంట్ చూసుకుంటే.. సినిమాతో ఆయన మంచి హిట్ అందుకోనున్నారని అర్థమవుతోంది. దానితోడు బాక్సాఫీస్ వద్ద పోటీ కూడా తక్కువ ఉండడంతో మంచి అడ్వాంటేజ్ గా మారింది

బచ్చల మల్లి చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా వివిధ సంస్థలు.. గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాయి. ఓవర్సీస్ లో ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది. తెలుగు రాష్టాల్లోని ఉత్తరాంధ్రలో svc ఫిల్మ్స్, సీడెడ్ ఏరియాలో జేపీఆర్ ఫిల్మ్స్ విడుదల చేస్తున్నాయి. నైజాంలో గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. రూ.1.40 కోట్లకు డీల్ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే నైజాంలో బచ్చల మల్లి మూవీకి గాను టికెట్ ధరలను మల్టీప్లెక్స్ లో రూ.180గా, సింగిల్ థియేటర్ లో రూ.150గా నిర్ణయించారు. దీంతో టికెట్ కాస్ట్ కూడా సినిమాకు మంచి అడ్వాంటేజ్ మారే అవకాశం ఉందనే చెప్పాలి. రీజనబుల్ కాస్ట్ ఉండడంతో.. మౌత్ టాక్ పాజిటివ్ రావాలి గానీ.. సినిమాకు తిరుగుండదు.

అదే సమయంలో క్రిస్మస్ కానుకగా బచ్చల మల్లితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఉపేంద్ర యూఐ విడుదల అవ్వనుంది. హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ముఫాసా థియేటర్లలో సందడి చేయనుంది. బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్ విడుదల-2 కూడా రిలీజ్ కానుంది. ఆ సినిమాకు కూడా నైజాంలో బచ్చల మల్లి రేట్లే నిర్ణయించారు. మరి ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News