బ‌డే మియాన్ చోటే మియాన్ ఫ్లైట్ ఛేజింగ్?

హృతిక్ రోష‌న్ - టైగ‌ర్ ష్రాఫ్ లాంటి మార్ష‌ల్ విద్య‌లు తెలిసిన హీరోల‌ క‌ల‌యిక‌లో 'వార్' చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే

Update: 2023-12-08 08:01 GMT

హృతిక్ రోష‌న్ - టైగ‌ర్ ష్రాఫ్ లాంటి మార్ష‌ల్ విద్య‌లు తెలిసిన హీరోల‌ క‌ల‌యిక‌లో 'వార్' చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించిన‌ సంగ‌తి తెలిసిందే. య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ కొట్టింది. ఇప్పుడు అదే తీరుగా అక్ష‌య్ కుమార్ తో టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన తాజా చిత్రంపైనా అంచ‌నాలేర్ప‌డ్డాయి. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఈ సినిమా టైటిల్ బ‌డే మియాన్ చోటే మియాన్.

భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'బడే మియాన్ చోటే మియాన్' విడుదల కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు యాక్షన్ హీరోలు న‌టిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ మూవీపై అంచనాలను పెంచేస్తూ.. తాజాగా దర్శకుడు అబ్బాస్ జాఫ‌ర్ ఒక యాక్షన్ సీక్వెన్స్‌ తెరవెనుక సన్నివేశాల చిత్ర‌ణ‌కు సంబంధించిన‌ ఫోటోల‌ను షేర్ చేసాడు. అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్ జోడీ ఒళ్లు గ‌గుర్పొడిచే భారీ యాక్ష‌న్ దృశ్యం చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నార‌ని ఈ ఫోటోలు చెబుతున్నాయి. ఎగిరే విమానంతో పోటీప‌డుతూ బడే మియాన్ చోటే మియాన్ బైక్ రైడ్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ఫోటోలను గ‌మ‌నిస్తే... అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్ రన్‌వేపై మోటారు సైకిల్‌లను నడుపుతున్నారు. సీఎన్-235 మీడియం రేంజ్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆ ఇద్ద‌రి మీదుగా ఎగురుతోంది. అక్షయ్ నల్లటి టీ-షర్ట్ - కార్గో ప్యాంటు ధరించాడు. అయితే టైగర్ గ్రే ట్యాంక్ టాప్ - ప్యాంటు ధరించాడు. BTS #BMCM 'C235 రంబుల్ ఇన్ ది స్కై' అని పోస్ట్‌కి ద‌ర్శ‌కుడు అబ్బాస్ అలీ జాఫ‌ర్ క్యాప్షన్ ఇచ్చాడు.

ఇటీవల అక్షయ్ కుమార్ న‌టిస్తున్న త‌దుప‌రి సినిమా విడుదలలో వ్యూహాత్మక మార్పు చేసినట్లు క‌థ‌నాలొచ్చాయి. అభిమానుల సామూహిక స్వరానికి ప్రతిస్పందిస్తూ, అక్షయ్ తన తదుపరి థియేట్రికల్ విడుదలల్లో మోస్ట్ అవైటెడ్ 'బడే మియాన్ ఛోటే మియాన్‌'కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ చర్య అతని చివరి సినిమా 'మిషన్ రాణిగంజ్' తర్వాత ఆరు నెలల గ్యాప్ తీసుకోవాల‌ని అక్ష‌య్ నిర్ణ‌యించుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్‌శిఖా దేశ్‌ముఖ్ సంయుక్తంగా నిర్మించిన 'బడే మియాన్ చోటే మియాన్' ఈద్ 2024కి విడుదల కానుంది.

Tags:    

Similar News