టికెట్ సేల్ సమాచారం మిస్సింగ్?
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ యాక్షన్ స్టార్లు నటించిన సినిమాకి ఓపెనింగులు ఆశించినంతగా రాకపోవడం ఆశ్చర్యపరుస్తోంది
మల్టీప్లెక్స్ కల్చర్‌లో కొన్ని తప్పుల తడక లెక్కల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. PVR, ఐనాక్స్, సినీపోలిస్ (పీఐసీ)లో టిక్కెట్ విక్రయాల్లో ఏదో తేడా ఉందంటూ నెటిజనుల్లో డిబేట్ కొనసాగుతోంది.నిజానికి పీఐసీలో పారదర్శకంగా ఎన్ని టికెట్లు తెగాయి? అన్న డేటా అందుబాటులో ఉంటుంది. ఈ సమాచారం పబ్లిక్ కి అందుబాటులో ఉంటుంది. ఈ మూడు మల్టీఫ్లెక్సులలో జవాన్, పఠాన్, కేజీఎఫ్ టికెట్ సేల్ ఎలా ఉందో పరిశీలిస్తే... జవాన్, పఠాన్ లు 5.5 లక్షల టికెట్ల రేంజులో దూసుకెళ్లగా, కేజీఎఫ్ 4లక్షల టికెట్ల అమ్మకాలతో రేసులో కొంత వెనకబడింది.
ఈ ఏడాది ఫైటర్ చిత్రం 1.45 లక్షలకు పైగా టికెట్ల సేల్ తో ముందంజలో నిలిచింది. అయితే ఇప్పుడు రిలీజ్ బరిలో ఉన్న `బడే మియాన్ చోటే మియాన్` టికెట్ సేల్ గురించి ఐపీసీలో ఎలాంటి సమాచారం లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం బుకింగ్ లు నిరాశాజనకంగా ఉండడమేనని గుసగుస వినిపిస్తోంది.
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ యాక్షన్ స్టార్లు నటించిన సినిమాకి ఓపెనింగులు ఆశించినంతగా రాకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. కారణం ఏదైనా కానీ, మల్టీప్లెక్స్ చైన్‌లు పీఐసీ టిక్కెట్ విక్రయ గణాంకాలను నిలిపివేసాయి. టికెట్ సేల్ సమాచారాన్ని బహిర్గతం చేయవద్దని నిర్మాతలు మల్టీప్లెక్స్‌లకు ఆదేశాలు ఇవ్వడంతో ట్రేడ్ విశ్లేషకులకు అమ్మకాల వివరాల్ని వెల్లడించడం లేదు. ముందస్తు టికెట్ సేల్ సరిగా లేదు! అంటే అది చెత్త సినిమా అని దానర్థం. నిజానికి ఈనెల 10న విడుదల కావాల్సి ఉండగా, ఆ మరుసటి తేదీ ఏప్రిల్ 11 కి వాయిదా పడింది. సెలవు రోజున భారీ ఓపెనింగులు వస్తాయని అంచనా వేస్తున్నారు.