ఆ నటిని బ్యాడ్ టైమ్ ఇంకా బంతాడేస్తోందే!
అలా మాళవిక కెరీర్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదై పోయాయి. మొత్తంగా ఆర్డర్ లో చూస్తే నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయినవే.
ముంబై బ్యూటీ మాళవిక శర్మ గురించి పరిచయం అవసరం లేదు. 'నేల టిక్కెట్' తో టాలీవుడ్ కి పరిచ యమైన అమ్మడు ఆ వెంటనే రామ్ సరసన 'రెడ్' సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలు సాధించాయో తెలిసిందే. రెండు ఒకదానికొకటి పోటీ పడి మరీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ చిత్రాలుగా తేలాయి. దీంతో అమ్మడికి ఛాన్సులు కష్టమే అనుకుంటోన్న సమయంలో కోలీవుడ్ లో 'కాఫీ విత్ కాదల్' చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమాతో ఏడాది చెన్నైలో గడిపేసింది.
ఆ తర్వాత మళ్లీ ఛాన్స్ రావడానికి ఏడాది సమయం పట్టింది. రెండు తెలుగు సినిమాలు పోయినా ఇటీవల రిలీజ్ అయిన గోపీచంద్ 'భీమా' చిత్రంలో ఛాన్స్ అందుకుంది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది.
ఈ సినిమాతో నైనా హిట్ అందుకుని రేసులో ఉండాలని ప్రయత్నించింది. కానీ ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అలా మాళవిక కెరీర్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదై పోయాయి. మొత్తంగా ఆర్డర్ లో చూస్తే నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయినవే.
మరి ఇలాంటి సమయంలో అవకాశాలు ఎవరు ఇస్తారు? అనేసారు! అమ్మడు 'భీమా' రిలీజ్ కి ముందే యంగ్ హీరో సుధీర్ బాబు తో 'హరోమ్ హర' అనే సినిమాకి కమిట్ అయింది. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ లో ఉంది. దీంతో ఇప్పుడు ఆశలన్నీ ఈ చిన్న సినిమాపైనే ఉన్నాయి. ఆ నాలుగు పరాజయాల నుంచి బయట పడా లంటే ఈసినిమా విజయం సాధించాల్సిందే. లేదంటే? మాళవిక కి అవకాశాలు కష్టమనే సంకేతాలు అందుతున్నాయి.
ఇప్పటికే హీరోయిన్ల మధ్య పోటీ ఎలా ఉందో తెలిసిందే. స్వీటీ అనుష్కనే కంబ్యాక్ లో ఇక్కడ పోటీని తట్టుకుని అవకాశాలు అందుకోలేకపోతుంది. మరి ఇలాంటి టఫ్ కాంపిటీషన్ లో మాళవిక ఛాన్సులు అందుకోవాలంటే ఇకపై అద్భుతాలే జరగాలి. అమ్మడు బేసిక్ గా లాయర్.. ఆ వృత్తి నుంచి మోడలింగ్ లోకి ఎంటరై అటుపై నటిగా టర్నింగ్ తీసుకుంది. మరి కొత్త అవకాశాల కోసం ఎలాంటి వ్యూహం వేస్తుందో చూడాలి.