పెద్దల్లుడిపై ప్రేమతో నటసింహం ఇలా!
నటసింహ బాలకృష్ణ దీవెనలో ఎంతో స్పెషాల్టీ ఉంటుంది. నిండైన మనస్సుతో ఎంతో సంతోషంగా దీవిస్తుంటారు.
నటసింహ బాలకృష్ణ దీవెనలో ఎంతో స్పెషాల్టీ ఉంటుంది. నిండైన మనస్సుతో ఎంతో సంతోషంగా దీవిస్తుంటారు. తనకన్నా చిన్న వాళ్లను, తనకు బాగా నచ్చిన వాళ్లు, కావాల్సిన వాళ్లు తారస పడితే బాలయ్య బాబు దీవించకుండా వదిలిపెట్టరు. తలమీద కుడి చేయి దీవించి పంపిస్తుంటారు. ముఖ్యంగా తన ఫ్యామిలీ మెంబర్లను ఈ విషయంలో విడిచి పెట్టరు. తప్పకుండా అక్కడ బాలయ్య దీవెన ఉండా ల్సిందే అంటారు.
తాజాగా మామ-అల్లుడు వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఓ ఈవెంట్ లో బాలయ్య-లోకేష్ తారస పడ్డారు. బాలయ్య కారు దిగి లోపలికి వెళ్లి బయటకు వస్తోన్న సమయంలో లోకేష్ కనిపిస్తారు. దీంతో వెంటనే బాలయ్య లోకేష్ ని దీవించారు. తొలుత లోకేష్ పరజ్ఞానంలో ఉన్నారు. ఆ తర్వాత మామ చేయి ఎత్తడం చూసి వెంటనే తల కిందకు దించి దీవెన అందుకున్నారు. ఆ తర్వాత బాలయ్య వెనుక వెళ్లి మామయ్య కారు దగ్గరుండి మరీ ఎక్కించారు.
సీటు లోపలకి వెళ్లగానే లోకేష్ డోర్ వేసి పంపించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నందమూరి-నారా అభిమానులు సంబర పడుతున్నారు. పెద్దల్లుడు అంటే మామకి ఎంత ఇష్టమో చూసారా? అంటూ ఆ వీడియోని షేర్ చేస్తున్నారు. మామ బాలయ్య విషయంలో అల్లుడు లోకేష్ ఎంతో చనువుగా ఉంటారు. బాలయ్యబాబు గారు, బాలయ్య మావయ్య అంటూ ముద్దుగా పిలుస్తుంటారు.
బాలయ్య సినిమా రికార్డుల గురించి, పొలిటికల్ రికార్డుల గురించి చినబాబు ఎంతో గర్వంగా చెబుతుం టారు. ఆ మధ్య ఓ రాజకీయ వేదికపై లోకేష్ తల్లి నారా భువనేశ్వరిని కూడా బాలయ్య దీవించిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ తర్వాత కుమారుడు మోక్షజ్ఞని కూడా బాలయ్య ఇలాగే దీవించి అభిమానుల్ని అలరించారు.