అన్ స్టాపబుల్ 4: పవర్ స్టార్ పై బాలయ్య ఎలివేషన్!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

Update: 2024-10-22 07:32 GMT

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆహా ఓటీటీలో ఇప్పటి వరకు ‘అన్ స్టాపబుల్’ మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూడింటిలో బాలయ్య తనదైన శైలిలో హోస్ట్ గా అందరిని అలరించాడు. చాలా మంది స్టార్ సెలబ్రెటీలు ఈ షోకి గెస్ట్ లుగా వచ్చారు డార్లింగ్ ప్రభాస్, పవన్ కళ్యాణ్ కూడా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.

వీరి ఎపిసోడ్స్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డిజిటల్ మీడియాలో అత్యధిక వ్యూవర్ షిప్ ఉన్న టాక్ షోలలో ఒకటిగా ‘అన్ స్టాపబుల్’ నిలిచింది. ఇక ఇందులో సీజన్ 4 దీపావళి నుంచి మొదలు కాబోతోంది. ఇందులో మొదటి ఎపిసోడ్ కి సంబందించిన గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఆయనతో బాలయ్య రాజకీయాల గురించి ఆసక్తికరమైన విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఆకాశంలో సూర్య చంద్రులు ఎలాగో… ఏపీలో బాబు, కళ్యాణ్ బాబు అలా అని అందరూ అనుకుంటున్నారు అంటూ బాలయ్య వేసిన డైలాగ్ గ్లింప్స్ లో హైలైట్ గా నిలిచింది. దీనికి చంద్రబాబు కూడా పాజిటివ్ గా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించినట్లు గ్లింప్స్ బట్టి అర్ధమవుతోంది. ఈ గ్లింప్స్ పై రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

మరో వైపు పవర్ స్టార్ అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా పబ్లిక్ అటెన్షన్ ని మాత్రం ఈ గ్లింప్స్ తో గ్రాబ్ చేసినట్లు అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా గెస్ట్ గా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఆయన ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసారంట. ఈ ఎపిసోడ్ లో రాజకీయ సంబంధ విషయాలపై బాలయ్య అల్లు అర్జున్ ని ప్రశ్నించినట్లు ఇండస్ట్రీ వర్గాలలో చర్చ నడుస్తోంది. అలాగే మరికొంత మంది స్టార్స్ కూడా ఈ సీజన్ లో షోకి గెస్ట్ లుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవిని కూడా బాలయ్య ఈ టాక్ షోలో ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News