సంక్రాంతి సినిమాలకు షాక్ ..!

పొంగల్ సినిమాలకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చింది.

Update: 2025-01-10 16:50 GMT

పొంగల్ సినిమాలకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు టికెట్ రేట్లను కూడా పెంచింది. ఐతే ఏపీలో ఆరు షోలపై హైకోర్టు సవరణలు సూచించింది. ఈ క్రమంలో సంక్రాంతి సినిమాలు అర్ధరాత్రి 1, తెల్లవారుజామున 4 గంటలు షోలు రద్దు చేస్తున్నారు. అంతేకాదు ఆరు షోలను కాస్త ఐదు షోలుగా కుదించారు. ఈ ఐదు షోలలో ఒకటి బెనిఫిట్ షోగా ప్రదర్శించవచ్చని ప్రకటించింది.

ప్రభుత్వ నిర్ణయం ఆ సినిమా మేకర్స్ కు షాక్ ఇవ్వడమే కాకుండా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు పెద్ద షాక్ తగిలినట్టే అయ్యింది. ఐతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఈమధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ కారణమని తెలుస్తుంది. అర్ధరాత్రి అపరాత్రిళ్లు సినిమాలు రిలీజ్ లు అవ్వడం వల్ల ఈమధ్యనే కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి.

ఇలాంటి వాటికి పర్మిషన్ ఇచ్చి ఏదో ఒక నష్టం జరిగిన తర్వాత ఆలోచించే కన్నా ముందు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని ఏపీ ప్రభుత్వం అలా నిర్ణయించింది. తెలంగాణాలో ఆల్రెడీ డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఎలాంటి టికెట్ ప్రైజ్ పెంచలేదు సరికగా షోస్ కూడా పెంచలేదు. ఏపీలో మాత్రం రిలీజ్ అవుతున్న 3 సినిమాలకు టికెట్ రేట్లు పెంచారు. ఐతే సినిమాకు వారం పది రోజుల పాటు ఆరు షోలకు పర్మిషన్ ఇవ్వగా ఇప్పుడు మాత్రం ఐదు షోలకే కుదించారు.

బెనిఫిట్ షోస్ అర్ధరాత్రి 1 గంటకు వేయడం వల్ల పరిస్థితి అదుపు తప్పే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఫ్యాన్స్ భారీగా వచ్చే ఆ టైంలో భద్రతా ఏర్పాట్లు కూడా కష్టమవుతుంది. అందుకే రాత్రి 1 గంటకు, ఉదయం 4 గంటల ఆటను రద్దు చేసి ఐదు షోలు వచ్చేలా టైమింగ్స్ అడ్జెస్ట్ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డాకు మహారాజ్, సంక్రాంతి సినిమాల మీద ఎఫెక్ట్ పడనుంది. మరి దీనిపై ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సంక్రాంతి కానుకగా నేడు ఆల్రెడీ గేమ్ ఛేంజర్ రిలీజైంది. శనివారం అంటే జనవరి 12న డాకు మహారాజ్, సోమవారం జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సందడి చేయనున్నాయి.

Tags:    

Similar News