NBK 109.. అబ్రార్‌ని మించిన రాక్షసుడు?
నిజానికి యానిమల్ చిత్రంలో అతడు 20 నిమిషాల నడివి పాత్రలో మాత్రమే కనిపించాడు. కనిపించిన ఆ కొద్ది నిమిషాలు దడ పుట్టించాడు
కొన్ని పాత్రలు అరుదుగా పుడుతుంటాయి. అదే కేటగిరీకి చెందినది అబ్రార్ పాత్ర. యానిమల్ చిత్రంలో అబ్రార్ హక్ పాత్రతో దడ పుట్టించాడు బాబి డియోల్. విలన్ పాత్రధారి అంటే కర్కశుడిగా దారుణమైన ప్రవర్తనతో ఉన్మాదిలా ఎలా ఉండాలో చూపించాడు. చాలా సినిమాల్లో చూసేసిన వాటికంటే భిన్నంగా ట్రై చేసాడు. ఫక్తు హిందూ సింగ్ ల కథలో అబ్రార్ హక్ అనే ముస్లిముగా బాబి డియోల్ కర్కశ కర్కోఠక నటన అందరికీ నచ్చింది. ఒక సామాన్యుడిగా లేదా సాధా సీదా యువకుడిగా లేదా క్లాసీ యువకుడిగా నటించిన ఏ పాత్రా జనానికి ఎక్కలేదు కానీ, అబ్రార్ గా నటించగానే బాబిడియోల్ అనే ఒకడున్నాడని అందరికీ తెలిసాడు. జనాల హృదయాలను అంతగా టచ్ చేసాడు.
నిజానికి యానిమల్ చిత్రంలో అతడు 20 నిమిషాల నడివి పాత్రలో మాత్రమే కనిపించాడు. కనిపించిన ఆ కొద్ది నిమిషాలు దడ పుట్టించాడు. దారుణమైన హింస, రక్తపాతం, హత్యలు, రేప్‌లతో హీటెక్కించాడు. అందుకే అబ్రార్ పాత్రలో చూసిన బాబీని ఇక మీదట రొటీన్ గా చూడగలరా? అంటే ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అందుకే ఇప్పుడు ఎన్బీకే 109 చిత్రంలో బాబి డియోల్ విలన్ గా నటిస్తున్నాడు అనగానే అభిమానుల్లో చాలా అంచనాలేర్పడ్డాయి.
బాలయ్య సినిమాలోను అతడు కచ్ఛితంగా క్రూరుడైన విలన్ గానే కనిపిస్తాడు కాబట్టి.. ఆ పాత్ర ఎంత కర్కశత్వం నిండి ఉంటుంది? అన్నది ఎవరికి వారు ఊహాగానాలు సాగిస్తున్నారు. ఒకవేళ అబ్రార్ పాత్ర కంటే తక్కువ చేసి చూపిస్తే దానిని తిరస్కరించేందుకు కూడా ఆస్కారం ఉంది. కానీ దర్శకుడు బాబి డియోల్ అతడిని అబ్రార్ కంటే గొప్పగా ఎలా చూపించగలడు? అన్నదే ఇప్పుడు అసలైన టాస్క్.. సందీప్ వంగాను మించి ఆలోచిస్తేనే బాబి ఇప్పుడు కర్కోఠక విలన్ పాత్రను రూపొందించగలడు. దీనికోసం అర్జున్ రెడ్డి- కబీర్ సింగ్- అబ్రార్ ముగ్గురూ కలిసి ఒకేసారి అతడిలోనికి ప్రవేశించాలేమో! సెక్స్ ఉన్మాది కసాయి కమ్ గ్యాంగ్‌స్టర్ అబ్రార్ హక్ ని మించిన పాత్రను ఆఫర్ చేస్తేనే బాబి కూడా శాటిస్ ఫై అవుతాడు సుమీ!