బాలయ్య బోయపాటి అఖండ 2 కాదా..?

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా అంటే ఆ సినిమా బాక్సాఫీస్ షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

Update: 2023-09-06 01:30 GMT

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా అంటే ఆ సినిమా బాక్సాఫీస్ షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. వరుస ఫ్లాపులతో కెరీర్ సందిగ్ధంలో పడిన టైం లో బాలకృష్ణతో సింహా సినిమా చేసి సూపర్ హిట్ కొట్టేలా చేశాడు బోయపాటి. ఊర మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అతను బాలయ్యని డైరెక్ట్ చేస్తే చాలు సినిమా హిట్ అన్నట్టే. సింహా, లెజెండ్, అఖండ ఇలా హ్యాట్రిక్ హిట్లతో దుమ్ము దులిపేశారు.

ఇక ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా అదే నాలుగో సినిమా స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న బాలయ్య బాబు దసరాకి సినిమా రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో సినిమా ఓకే చేశారు బాలకృష్ణ. ఆ సినిమాను కూడా 2024 మార్చి లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బాబీ సినిమా తర్వాత బోయపాటి శ్రీను సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవాశం ఉంది.

బోయపాటితో బాలయ్య అఖండ సీక్వెల్ గా అఖండ 2 చేస్తారని టాక్ వచ్చింది. కానీ అఖండ 2 ఆలోచనని పక్కన పెట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ టార్గెట్ తో ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ప్లాన్ చేస్తున్నారట బోయపాటి. బాలయ్య కోరిక మేరకే బోయపాటి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అఖండ 2 కథ రెడీగా ఉండగా దాన్ని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే మాత్రం బాలయ్య చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అఖండ 2 నే అవుతుంది.

బాలకృష్ణ సినిమా అంటే చాలు బోయపాటి ఎప్పుడైనా రెడీ అంటాడు. తనకు లైఫ్ ఇచ్చిన హీరో కి వరుస హిట్లు ఇస్తూ తన సత్తా చాటుతున్నాడు బోయపాటి శ్రీను. మరి అఖండ 2 కన్నా ముందు రాజకీయ నేపథ్యంతో వస్తున్న బిబి కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సెంచరీ తర్వాత తన సినిమాల వేగం పెంచిన బాలకృష్ణ యువ దర్శకులతో కలిసి పనిచేస్తున్నారు. వీర సింహా రెడ్డితో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనితో కూడా బాలయ్య సినిమా లైన్ లో ఉందని టాక్. ఈలోగా గోపీచంద్ మలినేని మరోసారి రవితేజతో సినిమా చేస్తారని తెలుస్తుంది.

Tags:    

Similar News