బాలయ్యతో పాన్ ఇండియా అతడేనా?
ఇప్పుడే హీరోని కదిపినా అంతా పాన్ ఇండియా సినిమాలే అంటున్నారు. రీజనల్ మార్కెట్ వైపు హీరోలంతగా శ్రద్ద చూపడం లేదు.
ఇప్పుడే హీరోని కదిపినా అంతా పాన్ ఇండియా సినిమాలే అంటున్నారు. రీజనల్ మార్కెట్ వైపు హీరోలంతగా శ్రద్ద చూపడం లేదు. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి అన్న రేంజ్ లో కొత్త కుర్రాళ్లు సైతం అలాంటి అటెంప్ట్ లే చేస్తున్నారు. ఇటీవలే యువ నటుడు తేజ సజ్జ `హనుమాన్` తో ఇండియానే షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా200 కోట్ల వసూళ్లు సాధిం చడంతో అంతా స్టన్ అయిపోతున్నారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ కుర్ర హీరోకి ఇదెలా సాధ్యమైందంటూ ఒకటే డిస్కషన్ సాగుతుంది. ఇక ప్రభాస్..చరణ్..ఎన్టీఆర్..బన్నీ లాంటి స్టార్లు ఇప్పటికే పాన్ ఇండియాలో లాంచ్ అయిపోయారు. అలాగే సీనియర్ హీరోలైన చిరంజీవి..నాగార్జున...వెంకటేష్ సైతం పాన్ ఇండియాలో సత్తా చాటే ప్రయత్నం చేసారు. ఈ జాబితాలో మిగిలిపోయిన హీరో ఎవరైనా ఉన్నారా? అంటే అది బాలయ్య మాత్రం.
ఆయన ఇంకా పాన్ ఇండియా సినిమా తీయలేదు. రీజనల్ మార్కెట్ పైనే దృష్టి పెట్టి సినిమాలు చేస్తు న్నారు. `అఖండ` తో బుల్లి తెర ద్వారా పాన్ ఇండియాలో కొంత వరకూ రీచ్ అయ్యారు. కానీ థియేట్రికల్ గా మాత్రం ఇంకా ఆ ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో అందుకు సమయం కూడా అసన్నమైనట్లే కనిపిస్తుంది. బాలయ్య ఏ సినిమా చేసినా తన మార్క్ ఉండేలా చూసుకుంటారు.
దీంతో ఆయన పాన్ ఇండియా చేస్తే యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బాలయ్య విజన్ కి తగ్గట్టు ప్రశాంత్ ఆదిత్య 369 లాంటి సినిమా ఆయనతో చేయాలని అన్నాడు. రఫ్ గా ఓ ఐడియా ఉందని...బాలయ్యని ఎలా ప్రజెంట్ చేయాలో కూడా తనకు ఓ ఐడియా ఉందని..లుక్ కూడా డిజైన్ చేసి పెట్టుకున్నట్లు తెలిపాడు. బాలయ్య కూడా యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్దంగానే ఉన్నారు.
ఇటీవల రిలీజ్ అయిన `హను మాన్` తో ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియాలో మారు మ్రోగిపోయింది. ఈ నేపథ్యంలో బాలయ్య...ప్రశాంత్ ని వదిలే ఛాన్స్ లేదనిపిస్తుంది. బాలయ్య ఒక్కసారి నమ్మారంటే? మరో విషయం ఆలోచించకుండా ముందుకెళ్లిపోతారు. డైరెక్టర్ కి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు బాలయ్య కల్పిస్తారు. దీంతో బాలయ్య పాన్ ఇండియాని దాదాపు ప్రశాంత్ తో కన్పమ్ చేసుకోవచ్చు అని గట్టిగానే వినిపిస్తుంది.