మాస్ హీరోలు.. ఇద్దరు ఒకేలా..

జూన్ 27వ తేదీన కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Update: 2024-06-19 08:16 GMT

టాలీవుడ్ ఫస్టాఫ్ లో ఈసారి పెద్దగా సినిమాల సందడే కనిపించలేదు. సంక్రాంతి తర్వాత పెద్ద హీరోల చిత్రాలే రిలీజ్ కాలేదు. నాగార్జున, మహేష్ బాబు, వెంకటేష్.. తన సినిమాలతో పెద్ద పండక్కి వచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు, ఐపీఎల్ వల్ల రిలీజ్ కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ కల్కి పోస్ట్ పోన్ అయ్యాయి. త్వరలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక 2024 సెకండాఫ్ లో వరుసగా సినిమాలు రానున్నాయి.

జూన్ 27వ తేదీన కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆ తర్వాత స్వాత్రంత్ర్య దినోత్సవం, వినాయక చవితి, దసరా, క్రిస్మస్ టార్గెట్ గా పలు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. సేఫ్ డేట్ చూసుకుని మిగతా సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పటికే సెట్స్ పై ఉన్న వివిధ మూవీలు రిలీజ్ డేట్ ను షెడ్యూల్ చేసుకునేందుకు చూస్తున్నాయి. వాటిలో రవితేజ మిస్టర్ బచ్చన్, బాలకృష్ణ NBK 109 సినిమాలు ఉన్నాయి.

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ రైడ్ మూవీకి రీమేక్ కు తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన షో రీల్ మంచి రెస్పాన్స్ అందుకుంది. రవితేజ తన మాస్ స్వాగ్ తో అలరించారు. హరీష్ శంకర్ మార్క్ క్లియర్ గా కనిపించింది. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో మేకర్స్ ఈ ఏడాదే సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ డేట్ కోసం సెర్చ్ చేస్తున్నారట. మరోవైపు, హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తైనట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాత నాగవంశీ.. 2024లోనే మూవీని విడుదల చేయాలని చూస్తున్నారు. దసరాకు రిలీజ్ అవుతుందని టాక్ వినిపించినా.. ఇంకా ఖరారు చేసుకోలేదు. ఇప్పుడు సరైన హాలీడే డేట్ కోసం మేకర్స్ చూస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి మిస్టర్ బచ్చన్, NBK 109 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో? ఎలాంటి హిట్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News