ఇక నుంచి నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ చూస్తారు : బాలకృష్ణ

బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Update: 2025-01-08 05:01 GMT

నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన డాకు మహారాజ్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అమెరికాలో భారీ ఎత్తున జరిగింది. నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఆ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ తాను వరుసగా సినిమాలు చేస్తూ ఉంటానని, వచ్చిన విజయాలు తనకు మరింత ఉత్సాహంను అందిస్తున్నామని అన్నారు. గతంలో ఒకే ఏడాది ఏడు హిట్స్ అందుకున్న దాఖలాలు ఉన్నాయి అన్నారు. డాకు మహారాజ్ సినిమా తర్వాత తన సెండ్‌ ఇన్నింగ్స్ మొదలవుతుంది బాలకృష్ణ ప్రకటించారు. తండ్రి ఎన్టీఆర్‌ స్ఫూర్తితో సినిమాలు చేస్తానంటూ ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్‌ నమోదు చేసిన బాలకృష్ణ తాజాగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జనవరి 12వ తారీకున సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా భారీ ఈవెంట్‌ను అమెరికాలో చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. నందమూరి అభిమానులు అనుకున్నట్లుగానే భారీ ఎత్తున హాజరు అయ్యారు. సినిమా ఈవెంట్‌కి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బాలకృష్ణ మాట్లాడుతూ సినిమాపై అంచనాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేశారు.

నాకు నేను సాన బెట్టుకుంటూ, నాన్నగారి స్ఫూర్తితో 50 ఏళ్ల సినీ ప్రస్థానం కొనసాగించాను. మరికొంత కాలం వరుసగా సినిమాలు చేస్తానంటూ ఫ్యాన్స్‌కి హామీ ఇచ్చారు. వరుసగా వచ్చిన విజయాలతో తన కెరీర్‌ రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కాబోతున్నట్లుగా పేర్కొన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాల గురించి మరింత అవగాహనతో వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా సినిమాలు, పాత్రల ఎంపికలో మెచ్యూరిటీ ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇకపై తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కాబోతుంది. తనను అభిమానులు, ప్రేక్షకులు మరింత అభిమానించే విధంగా సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు.

బాబీ దర్శకత్వంలో నాగ వంశీ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మించిన డాకు మహారాజ్‌ సినిమాలో బాలకృష్ణ డ్యూయెల్‌ రోల్‌ లో కనిపించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించగా ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. సంక్రాంతికి బాలకృష్ణ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ ఉందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ సెకండ్‌ ఇన్నింగ్స్ అంటే ఏం చేస్తారా అంటూ కొందరు అభిమానులు సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.



Tags:    

Similar News