చనిపోయిన తర్వాతా సంపాదించేస్తున్నారే!
చనిపోయిన తర్వాత కోట్లు సంపాదిస్తున్న గాయకులు వీళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్లే బంబా బక్యా-షాహుల్ హమీద్ లు.
సెలబ్రిటీ ఫేం హోదా ఉన్నంత కాలం డబ్బులకు కొదవుండదు. వద్దన్నా వచ్చి పడుతుంది. ఇది కేవలం కళారంగంలోనే సాధ్యమవుతుంది. పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించుకునే అవకాశం కేవలం సినిమా రంగంలోనే సాధ్యమవుతుంది. అయితే అందుకు ఎంతో ప్రతిభ..తెలివితేటలు ఎన్నో అవసరం. అన్నిరకాల కష్టనష్టాలకు ఓర్చిన తర్వాత వచ్చిన క్రేజ్ తోనే అది సాధ్యమవుతుంది. అలా ఒక్కసారి పాపులర్ అయిన తర్వాత భూమ్మీద ఉన్నంతకాలం కాసుల వర్షమే కురుస్తుంది.
కానీ ఇక్కడ సన్నివేశం అంతకు మించి అనిపిస్తుంది. అవును మనిషి సజీవంగా లేకపోయినా సరే ఆ పాపులారిటీతో కోట్లు సంపాదించుకునే అవకాశ ఉందని తెలుస్తోంది. అది ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహామాన్ ద్వారా ఇద్దరు గాయకులు సాధ్యమైంది. చనిపోయిన తర్వాత కోట్లు సంపాదిస్తున్న గాయకులు వీళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్లే బంబా బక్యా-షాహుల్ హమీద్ లు.
రెహమాన్ సంగీతం అందిచిన ఎన్నో మ్యూజికల్ హిట్స్ లో వీళ్లు గాయకులుగా పనిచేసారు. '2.0' లో 'కాలమే కాలమే'... 'జీన్స్ 'లో 'కాదలన్' సహా పలు హిట్ సాంగ్స్ ఆ కాంబినేషన్ లో వచ్చాయి. అవి శ్రోతల్ని ఎంతగా అలరించాయో చెప్పాల్సిన పనిలేదు. కానీ దురదృష్టవ శాత్తూ ఇద్దరు చిన్న వయసు లోనే చనిపోయారు. అయితే వాళ్లు చనిపోయినా వాళ్ల గొంతుల్ని మాత్రం రెహమాన్ ఏఐ టెక్నాలజీ ద్వారా పున సృష్టిస్తున్నారు. వారిపై ఉన్న అభిమానంతో పాటు గొప్ప గాయకులు కావడంతోనే రెహమాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
'లాల్ సలామ్' సినిమాలో కొన్ని పాటలకు వాళ్ల గాత్రం వినిపించనుంది. అయితే చనిపోయారని వాళ్ల గొంతుల్ని ఉచితంగా వాడుకోవడం లేదు రెహామాన్. అందుకు వాళ్ల కుటుంబ సభ్యుల నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. వాళ్లు ఒప్పుకున్న తర్వాతే పున సృష్టికి రెడీ అయ్యారు. వారి గొంతులు వారి కుటుంబ ఆస్తులుగా భావించి ఆ కుటుంబాలకు రెహమాన్ పారితోషికం కూడా చెల్లించినట్లు తెలిపారు. అలా చనిపోయిన తర్వాత ప్రతిభతో ఆ ఇద్దరు గాయకులు వాళ్ల కుటుంబాలకు ఆసరగా నిలబడు తు న్నారు. ఎంత ప్రతిభావంతులు కాకపోతే ప్రపంచంలో ఎంతో మంది సింగర్లు ఉండగా? వాళ్ల గొంతుల్నే రెహమాన్ కొరి మరీ పునసృష్టిస్తున్నాడు? అంటే నిజంగా వాళ్లిద్దరు అదృష్ట వంతులే. స్వర్గస్తులైనా వాళ్ల గాత్రాన్ని మళ్లీ వినే అవకాశం శ్రోతలకు దక్కుతుంది.