శేష్ తో హాట్ బ్యూటీ సాహసానికి రెడీ!
ఇంతవరకూ ఈ భామ సెట్స్ కి వెళ్లకపోవడంతో ఆమె ఉందా? లేదా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఆమె ఎంట్రీ లాంఛమైనట్లు తెలుస్తోంది.
స్పై థ్రిల్లర్ 'గుఢచారి -2' సెట్స్ లో సంగతి తెలిసిందే. అడవి శేషు కథానాయకుడిగా వినయ్ కుమార్ తెరకెక్కిస్తోన్న సినిమాపై అంచనాలు ఎలా ఉన్నా చెప్పాల్సినపనిలేదు. 'గుఢచారి' రిలీజ్ అయిన దగ్గర నుంచి పార్ట్ -2 కోసం ఓ సెక్షన్ ఆడియన్స్ ఎంతో ఎగ్టైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే శేష్ అండ్ కో చిత్రాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించడం సినిమాకి అదనపు అస్సెట్ గా కనిపిస్తుంది.
ఇప్పటికే వీరంతా షూట్ లో పాల్గొన్నారు. ఇక హీరోయిన్ గా మళ్లీ శోభితనే కొనసాగిస్తారని భావించినప్పటకీ ఆమెని తప్పించి బనితా సంధుని తెరపైకి తెచ్చారు. ఇంతవరకూ ఈ భామ సెట్స్ కి వెళ్లకపోవడంతో ఆమె ఉందా? లేదా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఆమె ఎంట్రీ లాంఛమైనట్లు తెలుస్తోంది. జీ-2 తదుపరి షెడ్యూల్ గుజరాత్ లోని భుజ్ లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో బనితా టీమ్ తో జాయిన్ అవుతుందని సమాచారం. ఇందులో శేష్ పై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
వాటిలో బనితో కూడా పాల్గొంటుందని తెలుస్తోంది. బనితాకి ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. ఐదేళ్ల క్రితం 'అక్టోబర్' అనే హిందీ సినిమాతో అమ్మడు బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'సర్దార్ ఉద్దమ్' లో నటించింది. అలాగే కోలీవుడ్ లో ఆదిత్యవర్మలోనూ ఈ భామనే హీరోయిన్. ఆ రకంగా అమ్మడు వెండితెరపై కొంత అనుభవాన్ని సంపాదించింది. ఈ నేపథ్యంలో జీ-2 తో తొలి పాన్ ఇండియా ఛాన్స్ చేజిక్కించుకుంది.
ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కిస్తున్నా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అమ్మడు చాలా ఆశలే పెట్టుకుంది. ఈవిజయంతో మళ్లీ బాలీవుడ్ లో కంబ్యాక్ అవ్వాలని చూస్తుంది. జీ-2 లో తన పాత్ర గురించి బనితా ఇప్పటికే ఓపెన్ అయింది. గతంలో ఎప్పుడు చేయనటి వంటి సాహసోపేతమైన రోల్ చేస్తున్నట్లు తెలిపింది. భుజ్ షెడ్యూల్ తో నేరుగా ఆ అనుభూతిని పొందనుంది.