యూత్ స్టార్ కి పోటీగా సీనియ‌ర్ స్టార్ రంగంలోకి!

ఈ చిత్రాన్ని ఆయ‌నే స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. జీవో పూన్నూసే ర‌చించిన న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

Update: 2024-12-05 17:30 GMT

కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్ ఇంత వ‌ర‌కూ గొప్ప న‌టుడిగానే ప్రేక్ష‌కుల‌కు తెలుసు. ఎన్నో చిత్రాల్లో న‌టించి మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా త‌న‌కంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్షకుల్ని అల‌రిం చారు. తాజాగా ఆ లెజండ‌రీ న‌టుడు `బ‌రోజ్: గార్డియ‌న్ ఆఫ్ ట్రెజ‌ర్` సినిమాతో ద‌ర్శ‌కుడిగానూ మారారు. ఈ చిత్రాన్ని ఆయ‌నే స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. జీవో పూన్నూసే ర‌చించిన న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

దీన్ని మోహ‌న్ లాల్ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి ఇంత కాలానికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మోహ‌న్ లాల్ లుక్ ఆద్యంతం ప్రెష్ ఫీల్ ని తీసుకొచ్చింది. మోహ‌న్ లాల్ నుంచి వ‌స్తోన్న మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మిది. ఇప్ప‌టికే చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. అక్టోబ‌ర్ లోనే చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యం కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డింది.

అప్ప‌టి నుంచి కొత్త రిలీజ్ తేదీపై మేక‌ర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా రిలీజ్ తేదీపై మోహ‌న్ లాల్ ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. డిసెంబ‌ర్ 25న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాన్ ఇండియాలో చిత్రం రిలీజ్ అవుతుంది. మ‌ల‌యాళం, హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ్ లో భారీ ఎత్తున రిలీజ్ స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

అదే రోజున యూత్ స్టార్ నితిన్ హీరోగా న‌టిస్తోన్న `రాబిన్ హుడ్` తెలుగులో రిలీజ్ అవుతుంది. `శ్రీకాకుళం షెర్లాక్స్` కూడా డిసెంబ‌ర్ 25న రిలీజ్ అవుతుంది. దీంతో `రాబిన్ హుడ్` నుంచి `బ‌రోజ్` కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మోహ‌న్ లాల్ చిత్రాల‌కు డిమాండ్ బాగుంది. ఆయ‌న సినిమాలు తెలుగులో ఇప్పటికే ఎన్నో చిత్రాలు అనువాద‌మైన సంగ‌తి తెలిసిందే. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లోనూ లాల్ కీల‌క పాత్ర‌ల్లో అల‌రించారు.

Tags:    

Similar News