హాట్ బ్యూటీ ఇంట హీటెక్కించే బెంజ్!
నటిగా అమ్మడి ట్యాలెంట్ ని గుర్తంచే పోటీ ఉన్నా ఇంకా రేసులో కనిపిస్తుంది.
హాట్ బ్యూటీ ప్రియామణి కెరీర్ హీరోయిన్ గా కాకపోయినా వచ్చిన అవకాశాలతో సంతోషంగానే సాగిపో తుంది. కీలక పాత్రలతో పాటు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా అమ్మడు బాగానే సంపాదిస్తుంది. చిన్న చిన్న ప్రక టనల్లోనూ నటిస్తూ ఆదాయం సమకూర్చుకుంటుంది. సౌత్ లో అవకాశాల పరంగా తెలుగు..తమిళ్ లో పర్వాలేదు. అలాగే వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. నటిగా అమ్మడి ట్యాలెంట్ ని గుర్తంచే పోటీ ఉన్నా ఇంకా రేసులో కనిపిస్తుంది.
ఇటీవలే ఆహాలో `భామాకలాపం 2` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈసినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకు ముందు తీసిన భామాకలాపం మంచి విజయం సాధించడంతోనే సీక్వెల్ ప్రయత్నం సక్సెస్ దిశగా వెళ్తుంది. తాజాగా ప్రియమణి ఓ ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ సీ మోడల్ కారుని కొనుక్కుంది.
ఈ కారు విలువ దాదాపు 80 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ప్రియమణి బెంజ్ కారు కొంది అన్న సంగతి ఆమె హైడ్ చేసినా? కంపెనీ తమ సోషల్ మీడియాలో రివీల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియమణి కారు కొనుక్కొని.. సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేసారు. దీంతో ప్రియమణి అభిమానులంతా విషెస్ తెలియజేస్తున్నారు.
ప్రియమణితో పాటు తన భర్త ముస్తఫా రాజ్.. అత్త కార్ తీసుకోడానికి వచ్చారు. అక్కడే కేక్ కట్ చేసి కార్ కొన్న ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియమణి కార్లు అంటే చాలా ఆసక్తి. ఇప్పటికే ఆమె వద్ద కొన్ని కార్లు ఉన్నాయి. బాగా నచ్చిన కారు మార్కెట్ లో కి వస్తే కొనేస్తుంది. బెంజ్ కొనాలి అని ఉన్నా? అది ఇప్పటికి సాద్యమైంది. ఇంకా ప్రియమణి ఇంట మరిన్ని బ్రాండెడ్ కార్లు నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.