ఆయన జైల్లో ఉండటం వల్ల కట్టప్ప మారాడు!
అయితే ఎక్కువ మంది గుర్తుంచుకునే పాత్రగా మాత్రం కట్టప్ప నిలిచింది అనడంలో సందేహం లేదు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని బాహుబలి తో అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాడు. ఆ సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షకులను అలరించింది. అయితే ఎక్కువ మంది గుర్తుంచుకునే పాత్రగా మాత్రం కట్టప్ప నిలిచింది అనడంలో సందేహం లేదు.
ప్రధాని నోటి నుంచి కూడా కట్టప్ప పేరు వచ్చింది అంటే ఏ స్థాయిలో ఆ పాత్ర విజయాన్ని సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కట్టప్ప పాత్రను తమిళ నటుడు సత్యరాజ్ పోషించిన విషయం తెల్సిందే. ఆ వేషధారణ మరియు బాడీ లాంగ్వేజ్ అన్ని విషయాల్లో కూడా కట్టప్ప కు సత్యరాజ్ పూర్తి న్యాయం చేశాడు.
బాహుబలి ప్రీ ప్రొడక్షన్ సమయంలో కట్టప్ప పాత్రకు గాను మొదట సంజయ్ దత్ అనుకున్నారట. కానీ ఆయన ఆ సమయంలో జైల్లో ఉండటం, వెంటనే బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల మరో ఆప్షన్ గా సత్య రాజ్ ను ఎంపిక చేశామని తాజాగా ఒక ఇంటర్వ్యూలో జక్కన్న తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
కట్టప్ప పాత్రకు మాత్రమే కాకుండా రాజమాత శివగామి పాత్రకు కూడా మొదట రమ్యకృష్ణ ను కాకుండా శ్రీదేవి ని అనుకున్నారట. అయితే ఆమె నో చెప్పడంతో రమ్యకృష్ణ వద్దకు ఆ పాత్ర వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మొత్తానికి బాహుబలి తో సత్యరాజ్ కి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు అయినట్లు అయ్యింది. రమ్యకృష్ణ కూడా బాహుబలి తర్వాత చాలా బిజీ అయ్యారు.