ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్ హాంపై డాక్యు సిరీస్
తాజాగా డాక్యుమెంటరీ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో బెక్‌హామ్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు "నేను ఎప్పుడూ స్కూల్‌లో బాగా రాణించలేదు" అని డైలాగ్ చెబుతున్నారు.
కొందరు చదువులో రాణిస్తే, మరికొందరు ఆటల్లో రాణిస్తారు. ఈ రెండో కోవకే చెందినవాడు అతడు. డేవిడ్ బెక్ హామ్ ప్రపంచంలోని అత్యంత పాపులర్ ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరిగా చరిత్రకెక్కాడు. అతని కెరీర్ మొత్తంలో మాంచెస్టర్ యునైటెడ్ కోసం ప్రధానంగా ఆడాడు. బెక్ హాం పాప్ సంస్కృతిలో ప్రకటనల ద్వారా అనేక ప్రదర్శనలలో తెరపై కూడా ప్రధాన పాత్ర పోషించాడు. బెక్‌హామ్ కొంతకాలంగా రిటైర్ అయి విశ్రాంత దశలో ఉన్నాడు. ఇంతలోనే ఇప్పుడు అతనిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ త్వరలో విడుదల కానుంది. మేటి ఆటగాడి జీవితంపై 4-భాగాల డాక్యుమెంట్-సిరీస్ అక్టోబర్ 4న ప్రసారం కానుంది.
తాజాగా డాక్యుమెంటరీ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో బెక్‌హామ్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు "నేను ఎప్పుడూ స్కూల్‌లో బాగా రాణించలేదు" అని డైలాగ్ చెబుతున్నారు. చిన్నప్పుడు తాను చేయాలనుకున్నదంతా ఫుట్‌బాల్ ఆడడమేనని చెప్పాడు. డాక్యుమెంటరీలో అతని భార్య విక్టోరియా బెక్‌హామ్‌ను కూడా కనిపించారు. తాము ఒక సంబంధంలోకి వచ్చాక దానిని రహస్యంగా ఉంచగలిగామని వెల్లడించింది. మేం కార్ పార్కింగ్ ప్లేస్ లో కలుసుకుంటాము. అది వినిపించేంత సీడీ కాదు... అని చెబుతుండగా.. బెక్ హాం దానిని `క్లాసి` అని వ్యాఖ్యానించాడు.
అలెక్స్ ఫెర్గూసన్ బెక్‌హామ్‌తో తన సంఘర్షణ గురించి ఈ డాక్యు సిరీస్ లో చర్చించాడు. బెక్ హాం గతంలో మాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్ అలెక్స్ ఫెర్గూసన్‌తో విభేదించాడు. కీర్తిప్రతిష్ఠలు పాపులారిటీ గురించి చర్చించే క్రమంలో బెక్ హామ్ మాట్లాడుతూ.. విజయం తన తలకెక్కలేదని చెప్పాడు. అయితే ఫెర్గూసన్ కి అది బాగా ఎక్కిందని కూడా అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా రియల్ మాడ్రిడ్‌లో తన నాలుగు సంవత్సరాల పదవీ కాలం, అది తనకు సమస్యగా మారిందని చెప్పాడు. నేను తినలేదు.. నిద్రపోలేదు... ఇది నాపై భారం వేసింది.. అని బెక్‌హామ్ చెప్పాడు. డాక్యుమెంటరీకి అకాడమీ అవార్డు గ్రహీత ఫిషర్ స్టీవెన్స్ దర్శకత్వం వహించారు. డేవిడ్ గార్ండర్ - గ్యారీ నెవిల్లే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా కొనసాగుతున్నారు.