ఐపీఎల్‌ కిల్ల‌ర్ గాళ్‌కి టాలీవుడ్‌లో ఛాన్స్?

ఇప్ప‌టికే ఈ బ్యూటీ సినీరంగంలో ఉంది గ‌నుక ఇప్పుడు ఈ అమ్మ‌డిపై టాలీవుడ్ ఫోక‌స్ మ‌ళ్లింద‌ని చెబుతున్నారు. పూరి జగ‌న్నాథ్, ఆర్జీవీ లాంటి ప్ర‌ముఖులు ఈ భామ‌కు అవ‌కాశం ఇచ్చేందుకు వెన‌కాడ‌రని గుస‌గుసలు వినిపిస్తున్నాయి.

Update: 2024-05-16 05:54 GMT

కొన్ని అవ‌కాశాలు ఎట్నుంచి ఎలా వ‌స్తాయో తెలీదు. మీడియా ఫోక‌స్.. లైట్నింగ్ మెరుపులు మీద‌ ప‌డాలే కానీ.. అంత‌గా లోకానికి సుప‌రిచితం కాని అమ్మాయిలు కూడా రంగుల ప్ర‌పంచంలో ఒక్క ఛాన్స్ కొట్టేస్తుంటారు. అలా ఒక్క అవ‌కావం వ‌చ్చిన‌ త‌ర్వాత స్టార్లు అయిన వారు లేక‌పోలేదు. ముఖ్యంగా ఆర్జీవీ, పూరి జ‌గ‌న్నాథ్ లాంటి వాళ్లు ఇలా కొంద‌రిని స్టార్లుగా మ‌లిచారు.

 

ఇప్పుడు ఐపీఎల్ టోర్నీలో కెమెరా కంటికి క‌నిపించిందో బెంగాళీ అమ్మాయి. పింక్ టాప్ బ్లాక్ ఇన్న‌ర్ ధ‌రించి టైట్ ఫిట్ లో అందాల‌ను ఆర‌బోసిన ఈ బ్యూటీ పైనే ఫోక‌స్ మ‌ళ్లింది. గ్రౌండ్ లో బంతిని సిక్స‌ర్లు బాదుతున్న బ్యాట్ ని వ‌దిలేసి మ్యాచ్ షూట్ చేసే కెమెరాల‌న్నీ ఈ అమ్మ‌డిపైనే ఫోక‌స్ చేయ‌డంతో ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయిపోయింది. 10000 వాట్ ఫ్ల‌డ్ లైట్ లా మెరిసిపోయిన ఈ అమ్మ‌డు కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొట్టింది.

 

గ‌తేడాది గుజరాత్ టైటాన్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఇద్దరు మిస్టరీ అమ్మాయిల ఫోటోలు ఇలానే వైర‌ల్ అయ్యాయి. ఆ ఇద్ద‌రూ సాహిభా షెర్నీ - అదితి హుండియాగా గుర్తించారు. ఈ ఏడాది టోర్నీలోను అలాంటి దృశ్యం కుర్ర‌కారును నిశ్చేష్ఠుల‌ను చేసింది. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కిక్కిరిసిన స్టేడియంలో నిలబడి బాడీ హగ్గింగ్ క్రాప్డ్ టాప్‌లో మ‌తి చెడ‌గొట్టిన ఈ బ్యూటీ బెంగాలీ నటి కం మోడల్ శిక్షా దాస్ అని తెలిసింది.

 

ఇప్ప‌టికే ఈ బ్యూటీ సినీరంగంలో ఉంది గ‌నుక ఇప్పుడు ఈ అమ్మ‌డిపై టాలీవుడ్ ఫోక‌స్ మ‌ళ్లింద‌ని చెబుతున్నారు. పూరి జగ‌న్నాథ్, ఆర్జీవీ లాంటి ప్ర‌ముఖులు ఈ భామ‌కు అవ‌కాశం ఇచ్చేందుకు వెన‌కాడ‌రని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. శిక్ష దాస్ లుక్స్ స్మైల్ ప్ర‌తిదీ క‌వ్వింత‌గానే క‌నిపిస్తోంది. అందుకే ఈ బ్యూటీకి ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల నుంచి పిలుపు అంద‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదని అంచ‌నా వేస్తున్నారు. ఎవ‌రి ల‌క్ ఎలా ఉందో వేచి చూడాలి.

Tags:    

Similar News