బెట్టింగ్ యాప్ కేసు: ED ఎదుటకు శ్రద్ధాకపూర్?
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ శుక్రవారం (ఈరోజు) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యే అవకాశం ఉంది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ శుక్రవారం (ఈరోజు) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యే అవకాశం ఉంది. రణబీర్ కపూర్ గురువారం విచారణ ఏజెన్సీ ముందు హాజరు కావాల్సి ఉండగా, ED ముందు హాజరు కావడానికి ఒక వారం సమయం కోరారు.
ED న్యాయవాది సౌరభ్ పాండే మాట్లాడుతూ.. "మహాదేవ్ యాప్ ఒక బెట్టింగ్ పోర్టల్ ..ఇది మనీలాండరింగ్ కేసుతో ముడిపడినది. రాయ్‌పూర్ ED కార్యాలయం విచారణ ప్రారంభించింది. నలుగురిని అరెస్టు చేశాం. విచారణ మరింత ముందుకు సాగడంతో చాలా మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. మేము కొందరికి సమన్లు జారీ చేసాము. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 50 కింద సమన్లు జారీ చేసాము. కానీ రణబీర్ ఈరోజు హాజరు కాలేదు. ఇమెయిల్ ద్వారా అతడు వారం సమయం కావాలని అభ్యర్థించాడు. ఇంకా ఏం చేయాలో మేము చూస్తాము" అని వ్యాఖ్యానించారు.
ANI వార్తా సంస్థ వివరాల ప్రకారం.. రణబీర్ కపూర్ మహదేవ్ బెట్టింగ్ యాప్ కోసం ప్రచార కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంలో యాప్‌ను ప్రమోట్ చేసిన అనేక ఇతర A-లిస్టర్ ప్రముఖులు, క్రీడా ప్రముఖులను కూడా ED అనుమానిస్తోంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి హాస్యనటుడు కపిల్ శర్మ, నటి హుమా ఖురేషీ, శ్రద్ధా కపూర్‌లకు ఈడీ నిన్న సమన్లు పంపింది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఏమిటి?
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో విలాసవంతమైన వివాహం జరిగింది. ఈ పెళ్లి కోసం దాదాపు రూ.200 కోట్లు ఖర్చు అయింది. అయితే ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించడం వలన ED దృష్టిని ఆకర్షించింది. రాస్ అల్-ఖైమాలో జరిగిన తన వివాహ వేడుకలో మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్, నాగ్‌పూర్ నుండి యుఎఇకి కుటుంబ సభ్యులను తీసుకెళ్లడానికి ప్రైవేట్ జెట్‌లను అద్దెకు తీసుకున్నాడు. వినోద కార్యక్రమాల ప్రదర్శన కోసం బాలీవుడ్ స్టార్లకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు.
చంద్రకర్ - రవి ఉప్పల్ దుబాయ్ నుండి కంపెనీని నిర్వహిస్తున్నారు. అయితే వీరంతా వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందినవారు. కొత్త వినియోగదారులను నమోదు చేసుకోవడానికి, IDలను సృష్టించడానికి .. బినామీ బ్యాంక్ ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బును లాండరింగ్ చేయడానికి ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. 70-30 బేసిస్ లో ఇందులో వాటాలు కూడా ఉంటాయి. బెట్టింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఈడీ విచారణలో పేర్కొంది. కొత్త వినియోగదారులను.. ఫ్రాంచైజీ (ప్యానెల్) కోసం వెతికేవారిని ఆకర్షించడానికి ప్రకటనల బెట్టింగ్ వెబ్‌సైట్‌ల కోసం భారతదేశంలో కూడా భారీ మొత్తంలో నగదు ఖర్చు చేసిందని ఎన్ ఫోర్స్ మెంట్ వెల్లడించింది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ అంటే ఏమిటి?
మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ యాప్ అనేది కొత్త వినియోగదారులను నమోదు చేసుకోవడానికి, వినియోగదారు IDలను సృష్టించడానికి .. బినామీ బ్యాంక్ ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బును లాండరింగ్ చేయడానికి అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్‌లను ప్రారంభించేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేసే గొడుగు సిండికేట్.