భగవంత్ కలెక్షన్స్.. బాలయ్య లెక్క ఇలా ఉంటది!

బాలయ్య బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

Update: 2023-11-09 23:30 GMT

నందమూరి బాలకృష్ణ మొదటిసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి సినిమా విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. బాలయ్య బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

అయితే ఈ సినిమా కంటెంట్ పరంగా అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగాను మంచి ప్రశంసలు అందుతుంది. అనిల్ రావిపూడి తన రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇందులో ఒక మంచి సందేశం కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో సినిమా ఆడియన్స్ కు ఎంతగానో నచ్చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే విషయంలో చాలా రకాల కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఇదివరకే చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేయాలని అనుకున్నారు. అందుకోసం ప్రత్యేకంగా బాక్స్ ఆఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ అంటూ ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు. ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య బాబు మాత్రం పూర్తి స్థాయిలో సినిమా మంచి లాభాలను అందించిందా లేదా అనే విషయం గురించి తెలుసుకున్న తర్వాతనే ఈవెంట్ పై ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు.

నిర్మాతకు మాత్రమే కాకుండా సినిమాపై పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా లాభాల్లో ఉన్నారా లేదా అనే విషయం గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా నమ్మకంగా అనిపించిన తర్వాతనే సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తే బాగుంటుంది అని ఆయన చాలా హుందాగా ఆలోచించారు.

ఇక మొత్తానికి ఇటీవల అయితే సినిమా పెట్టిన పెట్టుబడి వెనక్కి తేవడమే కాకుండా.. బయ్యర్లకు కూడా లాభాలను అందించింది అని బాలయ్య బాబు తెలుసుకున్నారు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కా షేర్ ట్యాగ్ తో ఈవెంట్ నిర్వహించాలి అనే ఫిక్స్ అయ్యారు. బాలయ్య బాబు ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో మరోసారి అర్థమయింది. అనవసరంగా లేని కలెక్షన్స్ పై వచ్చినట్లు హడావుడి చేయకూడదు అని ఆయన నిర్మాతలకు సూచించడంతోనే గొప్పతనం అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యింది అని తెలియడంతో సక్సెస్ ఈవెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Tags:    

Similar News