భగవంత్ కేసరి.. ఆ భయం అక్కర్లేదు

అయితే వీటిలో ఎలాంటి వాస్తవం లేదని చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ తో కన్ఫర్మ్ చేసింది.

Update: 2023-09-18 09:33 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భగవంత్ కేసరి. భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. బాలయ్య బాబు కెరియర్ లో అత్యధిక రెమ్యునరేషన్ ఈ చిత్రం కోస అందుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి కంటే ఎక్కువ బడ్జెట్ ఈ మూవీ కోసం నిర్మాతలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ ఆకట్టుకున్నాయి.

కెరియర్ లో ఫెయిల్యూర్ లేకుండా వరుసగా ఐదు సక్సెస్ లతో జోరు మీద ఉన్న అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమాతో డబుల్ హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు. దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బాలయ్య బాబుకి జోడీగా కనిపిస్తోంది.

తెలంగాణ నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుందని ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు. బాలయ్య నుంచి ఫ్యాన్స్ కోరుకునే పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్ తో పాటుగా అనిల్ రావిపూడి స్టైల్ ఫన్ కూడా సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది.

ఏపీలో రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో బాలయ్య ఫోకస్ అంతా కూడా అటువైపే ఉంది. ఈ కారణంగా రిలీజ్ వాయిదా పడొచ్చు అంటూ సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఎలాంటి వాస్తవం లేదని చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ తో కన్ఫర్మ్ చేసింది. షూటింగ్ చివరి దశకి వచ్చేసిందని, చెప్పిన టైంకి చెప్పినట్లు మూవీ రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు.

దీంతో భగవంత్ కేసరి మూవీ రిలీజ్ వాయిదా పడుతుందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. అయితే అనిల్ రావిపూడి తో చేస్తోన్న సినిమా రిలీజ్ అయిన కూడా బాబీ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News