గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే.. బాలయ్య మాస్ వార్నింగ్
ఈ క్రమంలోనే తాజాగా అభిమానుల కోసం ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. 'ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి' పేరుతో.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపుడి ఈ చిత్రాన్ని.. యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. అయితే ఈ చిత్ర విడుదల తేదీ దగ్గరపడడంతో సినిమాపై మరింత హైప్ పెంచేలా ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తోంది భగవంత్ కేసరి టీమ్.
ఈ క్రమంలోనే తాజాగా అభిమానుల కోసం ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. 'ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి' పేరుతో.. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకు సెట్లో జరిగిన మేకింగ్ వీడియోను పంచుకుంది.
హై ఎనర్జీతో థ్లిల్లింగ్ షూటింగ్ పూర్తైనట్లు క్యాప్షన్ రాసుకొచ్చింది. 8 నెలలు పాటు 24 అద్భుత లొకేషన్స్‌లో 12 భారీ సెట్స్ వేసి మూవీ షూటింగ్ జరిపినట్లు పేర్కొంది. శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్, బాలయ్యపై అనిల్ రావిపూడి చిత్రీకరించిన సీన్స్‌ను, ఇతర మూవీటీమ్ సినిమా కోసం ఎంతలా కష్టపడిందో ప్రతీది చూపించారు. యాక్షన్ సన్నివేశాల మేకింగ్‌ను కూడా చూపించారు. ఇక ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరె లెవెల్లో ఉంది. వీడియో చివర్లో 'కలిసి మాట్లాడుతా అన్న కదా... అంతలోనే మందిని పంపాలా... గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే' అంటూ బాలయ్య డైలాగ్ చెప్పడం హైలెట్ గా నిలిచింది.
'అఖండ', 'వీర సింహారెడ్డి' వంటి బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి రానున్న సినిమా కావడంతో.. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో బాలయ్య హ్యాట్రిక్ పక్కా కొడతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన విడుదలైన టీజర్, సాంగ్‌తో పాటు ఇతర ప్రచార చిత్రాలు.. ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్‌లు బాగా నచ్చాయి.
కాగా, ఈ చిత్రంలో శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటించగా.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా కనిపించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ దళపతి ఈగల్, మాస్ మహారాజా టైగర్ నాగేశ్వరరావుతో పోటీపడనుంది. ఇక ఈ చిత్రానికి తమన్- సంగీతం అందించారు. సి.రామ్ ప్రసాద్ - ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.