అతిలోక సుందరిని గుర్తు చేసిన భాగ్యశ్రీ

కొంతమంది హీరోయిన్స్ మొదటి సినిమాతో తమ చరిష్మటిక్ లుక్, స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు.

Update: 2024-08-03 10:15 GMT

కొంతమంది హీరోయిన్స్ మొదటి సినిమాతో తమ చరిష్మటిక్ లుక్, స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి చరిష్మటిక్ లుక్ తో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన భామలని చూసుకుంటే వెటరన్ స్టార్ జయప్రద, తరువాత శ్రీదేవి, సౌందర్య, రంభ లాంటి వారు కనిపిస్తారు. అందం, అభినయం కలగలిసిన పుత్తడిబొమ్మల్లా వారు అంటారు. సుదీర్ఘ కాలం ఈ అందాల భామలు హీరోయిన్స్ గా కొనసాగారు. అలాగే హిందీలో మాధురీ దీక్షిత్ కూడా తన చరిష్మటిక్ లుక్ తో అందరిని మెస్మరైజ్ చేసి సుదీర్ఘ కాలం బాలీవుడ్ ని రూల్ చేసింది.

ఈ జెనరేషన్ అలాంటి అందాల ముద్దుగుమ్మ ఎవరున్నారా అని చూసుకుంటే వెంటనే అందరి కళ్ళు భాగ్యశ్రీ బోర్సే మీదకి వెళ్ళాయి. భాగ్యశ్రీ బోర్సే హిందీలో యారియాన్ 2 సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే భాగ్యశ్రీ తన అందంతో కుర్రాళ్ళు మనసు గెలిచేసింది. తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి జిక్కీ అనే మెలోడీ సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిక్కీ జె మియర్ ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు.

ఈ సాంగ్ లో భాగ్యశ్రీ అందం, అభినయం, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో జగదీకవీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవిని గుర్తుచేసింది అనే మాట వినిపిస్తోంది. రాఘవేంద్రరావు హీరోయిన్స్ అందాన్ని సాంగ్స్ లో అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారనే అభిప్రాయం అందరిలో ఉంది. అలాగే హరీష్ శంకర్ అద్భుతమైన విజువల్స్ తో జిక్కీ సాంగ్ ని ఆవిష్కరించారు. భాగ్యశ్రీ అందాన్ని కూడా అద్భుతంగా బంధించారు. ఈ సాంగ్ చూసిన వారి కళ్ళు పూర్తిగా భాగ్యశ్రీ అందానికి అతుక్కుపోయాయని చెప్పొచ్చు.

ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా మంచి చరిష్మాటిక్ గా ఒకప్పటి శ్రీదేవి, మాధురీ దీక్షిత్ లని గుర్తుచేసిందనే మాట వినిపిస్తోంది. ఈ సాంగ్ లో భాగ్యశ్రీ అందంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవదాసులో ఇలియానా తర్వాత మరల ఆ స్థాయిలో అందంతో భాగ్యశ్రీ కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ కాకుండానే భాగ్యశ్రీ విజయ్ దేవరకొండకి జోడీగా ఓ సినిమాలో కన్ఫర్మ్ అయ్యింది.

అలాగే నాచురల్ స్టార్ నానికి జోడీగా ఒక సినిమాలో కన్ఫర్మ్ అయ్యిందంట. ఈ అమ్మడు టాలీవుడ్ నెక్స్ట్ స్టార్ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయని అప్పుడే సినీ విశ్లేషకులు కితాబు ఇచ్చేస్తున్నారు. దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా భాగ్యశ్రీ ఉందనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఈ బ్యూటీ ఏ రేంజ్ లో టాలీవుడ్ ప్రేక్షకులని ఇంప్రెస్ చేస్తుందనేది వేచి చూడాలి.

 

Tags:    

Similar News