వీడియో: కల్కి భైరవ ఫీవర్ ఇలా ఉంది
ప్రభాస్ ధరించిన గ్లాసెస్ తో పాటు తాను రూపొందించిన స్పెషల్ డిజైనర్ డ్రెస్ ని ప్రదర్శిస్తూ.. ట్రౌజర్, స్లీవ్ లెస్ షర్ట్.. డిజైన్ లను .ఏవైఇ జూడ్ అనే షార్ట్స్ మేకర్ లేటెస్ట్ వీడియోలో ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది.
ప్రభాస్ నటించిన కల్కి 2989 ఏడి గ్రాండ్ సక్సెస్ సాధించి, బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ ని అధిగమించిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనిదత్- స్వప్నాదత్- ప్రియాంక దత్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఇదిలా ఉంటే కల్కి థియేటర్లు ఇప్పటికీ వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో ప్రభాస్ మానియా ఒక రేంజులో ఉంది.
థియేటర్లలో భైరవ పాత్ర ఎంటర్ అయినప్పుడల్లా ఫ్యాన్స్ వీలలతో గగ్గోలు పెట్టిస్తున్నారు. ప్రభాస్ మాస్ ఫ్యాన్స్ మ్యాసివ్ గా సౌండ్ చేస్తుంటే థియేటర్లు దద్దరిల్లుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే భైరవ గెటప్ అతడు ధరించిన కళ్లద్దాలు, అల్ట్రా మోడ్రన్ టెక్నలాజికల్ వెహికల్ ఇవన్నీ ఇప్పటికీ ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి.
భైరవ పాత్ర స్ఫూర్తితో రూపొందించిన యూట్యూబర్ వీడియో ఒకటి ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. ప్రభాస్ ధరించిన గ్లాసెస్ తో పాటు తాను రూపొందించిన స్పెషల్ డిజైనర్ డ్రెస్ ని ప్రదర్శిస్తూ.. ట్రౌజర్, స్లీవ్ లెస్ షర్ట్.. డిజైన్ లను .ఏవైఇ జూడ్ అనే షార్ట్స్ మేకర్ లేటెస్ట్ వీడియోలో ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇది ప్రభాస్ అభిమానుల్లో వైరల్ గా దూసుకెళుతోంది.
ఇక సినిమా క్లైమాక్స్ లో ఎంతో లైటర్ వెయిన్ గా ఉండే భైరవ పాత్రలో కొత్త షేడ్ ని చూపిస్తూ అతడు సూర్యుని అంశతో జన్మించిన కుంతీ పుత్రుడు కర్ణుడు అని నాగి చూపించిన తీరు ఆకట్టుకుంది. అర్జునుడి రధాన్ని సైతం రెండడుగులు వెనక్కి జరిగేట్టు ఆపగలిగే వీరుడిగా ప్రభాస్ ని చూపించిన తీరు ఫ్యాన్స్ ని గగ్గోల పెట్టించింది థియేటర్ లో. ఓవరాల్ గా ఇప్పుడు ప్రభాస్ పై వీరాభిమానాన్ని చాటుకుంటూ ఆ ఫ్యాషన్ ని అభిమానులు అనుసరించాలనుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.