జక్కన్న మెచ్చిన సూరీడు 18 ఏళ్ల తర్వాత ఇలా..!
చత్రపతిలో చిన్న పిల్లాడిగా కనిపించిన భశ్వంత్ 18 ఏళ్ల తర్వాత ఇలా కనిపించాడు. ఆన్ స్క్రీన్ తల్లి అయిన అనిత చౌదరితో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెలుగు ప్రేక్షకులకు అందించిన గొప్ప చిత్రాల్లో ఒకటి చత్రపతి. ప్రభాస్ హీరోగా శ్రియ హీరోయిన్ గా నటించిన చత్రపతి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలోని ప్రతి పాత్ర ఎప్పటికి కూడా గుర్తుండి పోయేలా రాజమౌళి తీర్చిదిద్దాడు.
చత్రపతి సినిమాలో సూరీడు అనే కుర్రాడి పాత్ర అత్యంత కీలకం. ఆ కుర్రాడి వల్లే కథ మొత్తం టర్న్ అవుతుంది. అమాయకంగా కనిపిస్తూనే మంచి నటన కనబర్చుతూ భశ్వంత్ వంశీ చత్రపతిలో నటించి మెప్పించాడు. అనిత చౌదరీ కి కొడుకుగా భశ్వంత్ చత్రపతి సినిమాలో సూరీడు పాత్రలో కనిపించాడు.
ఆ సినిమాలో కనిపించింది కొద్ది సమయం అయినా కూడా ఇంకా ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఎంతటి ప్రాధాన్యత ఆ పాత్రకు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చత్రపతి షూటింగ్ సమయంలో నటీనటుల ఎంపిక చేస్తున్న సమయంలో సూరీడు పాత్ర ఆడిషన్స్ కోసం భశ్వంత్ వంశీ వచ్చాడట.
మొదటి సారి భశ్వంత్ ను చూసిన వెంటనే సూరీడు పాత్రకు కచ్చితంగా సెట్ అవుతాడు అంటూ రాజమౌళి చాలా నమ్మకం పెట్టుకుని మరీ ఎంపిక చేశాడట. ఏమాత్రం అనుమానం లేకుండా రాజమౌళి తీసుకున్నందుకు అదే స్థాయిలో మెప్పించాడు.
చత్రపతిలో చిన్న పిల్లాడిగా కనిపించిన భశ్వంత్ 18 ఏళ్ల తర్వాత ఇలా కనిపించాడు. ఆన్ స్క్రీన్ తల్లి అయిన అనిత చౌదరితో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మీసాలు, గడ్డం పెంచిన ఈ కుర్రాడు హీరో రేంజ్ లో ఉన్నాడు. జూనియర్ ప్రభాస్ అన్నట్లుగా కనిపిస్తున్న భశ్వంత్ వంశీ త్వరలో హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఫోటో చూస్తుంటే అనిపిస్తుంది.