అస‌లు దెయ్యం అవ‌తారం ఎవ‌రిదో?

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ నుంచి టీజ‌ర్, ట్రైల‌ర్ ప్ర‌తీది గ్రాండ్ స‌క్సెస్ అయింది.

Update: 2024-10-10 11:30 GMT

`భూల్ భూల‌య్య` రెండు భాగాలు ఎలాంటి విజ‌యం సాధించాయో తెలిసిందే. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన సినిమాలు సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేసాయి. దీంతో `భూల్ భూల‌య్య‌-3` ప్ర‌క‌టించిన నాటి నుంచే అంచ‌నాలు పీక్స్ లో మొద‌ల‌య్యాయి. అటుపై సినిమా నుంచి రిలీజ్ అయ్యే ఒక్కో అప్డేట్ అంతకంత‌కు అంచ‌నాలు పెంచేసింది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ నుంచి టీజ‌ర్, ట్రైల‌ర్ ప్ర‌తీది గ్రాండ్ స‌క్సెస్ అయింది.

ఇటీవ‌ల రిలీజ్ అయిన ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా క‌ట్ చేసారు. థ్రిల్లింగ్ అంశాల‌తో పాటు కావాల్సినంత ఫ‌న్ క‌థ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. విద్యాబాలన్, కార్తీక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి దిమ్రీ ఈ సినిమాలో నటించారు. తొలి రెండు భాగాల్లో మంజూలిక పాత్ర ఏ రేంజ్ లో పండిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు మూడ‌వ భాగంలోనూ ఆ పాత్ర అంతే హైలైట్ అవుతుంది.

అయితే ఈసారి ఆ పాత్ర ఎవ‌రు పోషించారు? అన్న‌ది ఇంట్రెస్టింగ్ గా మారింది. ట్విస్ట్ ఏంటంటే? ఈసారి ఇద్దరు మంజూలిక పాత్రలో నటించారు. మంజూలికగా మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ కనిపించనున్నారు. అయితే వారిద్ద‌రిలో అసలు మంజూలిక ఎవ‌రు? అన్న‌ది స‌స్పెన్స్. ఆ పాత్ర‌ధారి ఎవ‌రు? అన్న‌ది తెలి యాలంటే సినిమా చూడాల్సిందే. అనీస్ బాజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నవంబర్ 1న రిలీజ్ అవుతుంది.

ట్రైల‌ర్ లోనే అన్నిర‌కాల ర‌సాలు ఉన్న చిత్రంగా అర్ద‌మ‌వుతుంది. హార‌ర్ తో పాటు, కామెడీకి పెద్ద పీట వేసారు. ముఖ్యంగా హార‌ర్ ప్రియుల్ని అల‌రించే చిత్రంగా క‌నిపిస్తుంది. సినిమాలో విజయ్ రాజ్, సంజయ్ మిశ్రా, రాజ్‌పాల్ యాదవ్ వంటి కమెడియన్స్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Full View
Tags:    

Similar News